Selavanuko Song Lyrics Heart Attack Movie (2014)



Selavanuko Song Lyrics Heart Attack Movie (2014)

Movie:  Heart Attack
Lyrics:  Bhaskara Bhatla
Music:  Anup Rubens
Singer:  Chaitra

సెలవనుకో మరి ఏడవకే మనసా... ఓహో...
కలగనకే అది నిజమైపోదు కదా...
ఈ దూరం ఏనాటికి చేరువవ్వునో...
ఈ మౌనం ఇంకెప్పుడు మాటలాడునో...
కన్నుల్లోని కన్నీటి కెరటాలలో ....
నేనెమై పోవాలి... నిన్నేమనుకోవాలి...
ఏ మనసుని తిట్టాలి.. ఈ క్షణం... హొ. హొ.
సెలవనుకో మరి ఏడవకే మనసా...
కలగనకే అది నిజమైపోదు కదా...

అనుకున్నా అనుకున్నా నాతోటే ఉంటావనుకున్నా...
నాలాగే నీక్కూడ నేనంటే ఇష్టం అనుకున్నా...
పిలిచానా రమ్మనీ... కసిరానా పొమ్మనీ...
చివరికి ఈ ఆటలో ఐపోయా బోమ్మనీ...
నువ్వు కాదంటే ఇక రానంటే మన ఇద్దరి మద్య ఇంకేం లేదంటే...
నేనెమై పోవాలి... నిన్నేమనుకోవాలి...
ఏ మనసుని తిట్టాలి.. ఈ క్షణం...
సెలవనుకో మరి ఏడవకే మనసా..

హొ.. నువ్వంటే నాలాంటి ఇంకో నేనని అనుకొన్నా...
ఇన్నాళ్ళి భ్రమలొనే ఆనందంగా బ్రతికానా...
నచ్చిందే తడవుగా వెళ్ళోద్దే అలుసనీ...
చెబుతున్నా మనసుకి వింటుందా మాటనీ...
నా ఊహల్ని నా ఆశల్ని నరికేస్తూ నవ్వుని చిదిమేస్తే...
నేనెమై పోవాలి... నిన్నేమనుకోవాలి...
ఏ మనసుని తిట్టాలి.. ఈ క్షణం...
సెలవనుకో మరి ఏడవకే మనసా..
Reactions

Post a Comment

0 Comments