Endhukila Nannu Song Lyrics Heart Attack Movie (2014)



Endhukila Nannu Song Lyrics Heart Attack Movie (2014)

Movie:  Heart Attack
Lyrics:  Bhaskara Bhatla
Music:  Anup Rubens
Singer   :  Kunal Ganjawala


ఏందుకిలా నను వేధిస్తున్నావే... ఓ. ఓ..
ఏందుకనీ నను వెలివేస్తున్నావే...
నా హృదయం నీ తోడే కోరుకుందనా...
నా ప్రాణం నీ చుట్టూ తిరుగుతోందనా...
అన్యాయంగా తోస్తుంటె నట్టేటిలో ఇలా...
నేనెమై పోవాలి... నిన్నేమనుకోవాలి...
ఏ మనసుని తిట్టాలి.. ఈ క్షణం... హు.. హు...
ఏందుకిలా నను వేధిస్తున్నావే...
ఏందుకనీ నను వెలివేస్తున్నావే...

హొ.. నను నేను వదిలేసి నువ్వే కావాలంటున్నా...
నాదంటు మిగిలుంటే అది నువ్వే నువ్వే అంటున్నా...
నేన్నీకు వద్దనీ... నీతో నడవొద్దనీ...
నీ దారే నీదని గీసావా గీతని...
నీ గుండెల్లో నా గురుతుల్ని తీరాన్నె తాకిన అలలా తుడిచేస్తే...
నేనెమై పోవాలి... నిన్నేమనుకోవాలి...
ఏ మనసుని తిట్టాలి.. ఈ క్షణం... హో...

హొ.. వెలుగంతా తరిమేసి చీకటిలో నన్ను తోసావా...
గతమంతా చెరిపేసి శూన్యంలో నిలబెడతావా...
నాకన్నీ నువ్వనీ అనుకోడం పాపమా...
పూజించే చేతిని నరికేంత కోపమా...
నీ తలపుల్లో మైమరపుల్లో నా మనసుని తిప్పి రెక్కలు విరిచేస్తే...
నేనెమై పోవాలి... నిన్నేమనుకోవాలి...
ఏ మనసుని తిట్టాలి.. ఈ క్షణం... హు.. హు...
ఏందుకిలా నను వేధిస్తున్నావే...
ఏందుకనీ నను వెలివేస్తున్నావే... హే హే.. హే

Reactions

Post a Comment

0 Comments