Nuvvu Yevvari Yedalo Song Lyrics Malliswari Movie (2004)

Nuvvu Yevvari Yedalo Song Lyrics Malliswari Movie (2004)

Movie:  Malliswari
Lyrics:  Sirivennela
Music:  Koti
Singer:  SP Balu

నువు ఎవ్వరి ఎదలో పువ్వుల ఋతువై ఎప్పుడు వస్తావో
నిను నమ్మిన జతలో నవ్వులు చిదిమి ఎందుకు పోతావో
తెలియదే ఎవ్వరికీ ....తేలదే ఎన్నటికీ.....
అందుకే నీ కధకీ .... అంతులేదెప్పటికీ....
తీరాలులేవే ప్రేమా... నీ దారికి

కలతలే కోవెలై కొలువయే విలయమా...
వలపులో నరకమే వరమనే విరహమా....
తాపమే దీపమా..వేదనే వేదమా....
శాపమే దీవెనా నీకిదే న్యాయమా....
కన్నీరు అభిషేకమా నిరాశ నైవేద్యమా
మదిలో మంటలే యాగమా....
ప్రణయమా ......
నువు ఎవ్వరి ఎదలో పువ్వుల ఋతువై ఎప్పుడు వస్తావో
నిను నమ్మిన జతలో నవ్వులు చిదిమి ఎందుకు పోతావో

రెప్పలే దాటదే ఎప్పుడూ ఏకల....
నింగినే తాకదే కడలిలో ఏ అల..
నేలపై నిలవదే మెరుపులో మిలమిల
కాంతిలా కనబడే .... భ్రాంతి ఈ వెన్నెల....
అరణ్యాల మార్గమా... అసత్యాల గమ్యమా....
నీతో పయనమే పాపమా
ప్రణయమా...
నువు ఎవ్వరి ఎదలో పువ్వుల ఋతువై ఎప్పుడు వస్తావో
నిను నమ్మిన జతలో నవ్వులు చిదిమి ఎందుకు పోతావో
తెలియదే ఎవ్వరికీ ....తేలదే ఎన్నటికీ.....
అందుకే నీ కధకీ .... అంతులేదెప్పటికీ....
తీరాలులేవే ప్రేమా... నీ దారికి 
Reactions

Post a Comment

0 Comments