Nuvventha Andagathe Song Lyrics Malliswari Movie (2004)

Nuvventha Andagathe Song Lyrics Malliswari Movie (2004)

Movie:  Malliswari
Lyrics:  Sirivennela
Music:  Koti
Singer:  Karthik

నువ్వెంత అందగత్తెవైనగాని అంత బిరుసా....
తెగ వెంటబడుతున్ననంటె నీకు ఇంత అలుసా
నేనింత కానివాణ్ణి కాదుగద కన్నె వయసా....
నీ కంటికి నేనొక చిన్న నలుసా
నిన్నే ....నిన్నే...నేను కోరుకున్నది నిన్నే....
నన్నే...నన్నే... ఒప్పుకోక తప్పదింక నన్నే....
నువ్వెంత అందగత్తెవైనగాని అంత బిరుసా....
తెగ వెంటబడుతున్ననంటె నీకు ఇంత అలుసా
నేనింత కానివాణ్ణి కాదుగద కన్నె వయసా....
నీ కంటికి నేనొక చిన్న నలుసా

ఔను అంటె నిను చూసుకోనా మహరాణి తీరుగా
కాదు అంటె వదిలేసి పోను అది అంత తేలికా
లేనిపోని నఖరాలు చేస్తే మరియాద కాదుగా
ఇంతమంచి అవకాశమేది ప్రతిసారి రాదుగా
తగని వాడినా చెలీ తగవు దేనికే మరీ
మనకు ఎందుకే ఇలా...అల్లరీ...
నువ్వెంత అందగత్తెవైనగాని అంత బిరుసా....
తెగ వెంటబడుతున్ననంటె నీకు ఇంత అలుసా
నేనింత కానివాణ్ణి కాదుగద కన్నె వయసా....
నీ కంటికి నేనొక చిన్న నలుసా
నిన్నే ....నిన్నే...నేను కోరుకున్నది నిన్నే....
నన్నే...నన్నే... ఒప్పుకోక తప్పదింక నన్నే....

 కన్నెగానే  ఉంటావా చెప్పు ఏ  జంట తోడు చెరక
నన్ను మించి ఘనుడైనవాన్ని చూపించలేవుగా
మీసమున్న మొగవాన్ని కనుక అడిగాను సూటిగా
సిగ్గు అడ్డుపడుతుంటే చిన్న సైగయినా చాలుగా
మనకి రాసి ఉన్నాది తెలుసుకోవే అన్నది
బదులు కోరుతున్నది నా మాది 
నువ్వెంత అందగత్తెవైనగాని అంత బిరుసా....
తెగ వెంటబడుతున్ననంటె నీకు ఇంత అలుసా
నేనింత కానివాణ్ణి కాదుగద కన్నె వయసా....
నీ కంటికి నేనొక చిన్న నలుసా
నిన్నే ....నిన్నే...నేను కోరుకున్నది నిన్నే....
నన్నే...నన్నే... ఒప్పుకోక తప్పదింక నన్నే....

Reactions

Post a Comment

0 Comments