I Am In Love song Lyrics Subramanyam For Sale Movie (2015)


I Am In Love song Lyrics Subramanyam For Sale Movie (2015)

Movie:  Subramanyam For Sale
Lyrics:  Vanamali
Music:  Mickey J Meyer
Singers:  Aishwarya Majmudar, Aditya
Cast     :  Sai Dharam Tej, Regina



తొలి తొలిగా.. తొలకరిగా తోసెను ముందుకు తొందరలూ
కలివిడిగా.. కలిసెనుగా చూపుల దొంతరలూ
మనసును.. గట్టి మేళమే
మనువుకు.. తట్టి లేపగా
మెలుకువలో.. కలలు గనే.. మెలికలలో..
ఈ సందల్లొ.. సంద్రాలు.. నిలువెల్ల ముంచేస్తుంటే
నాలో ఏం జరిగిందో.. ఏమో.. I Am In Love
నాలో ఏం జరిగిందో.. ఏమో.. I Am In Love

దూరం మాయం కానీ.. ప్రాయం సాయం రానీ
నాలో పొంగే ప్రేమె.. నీకే సొంతం కానీ
మాటే పలికే మంత్రం మనసే మంగళ సూత్రం
నీలో నాలో వయసుల వేడే అగ్నిహోత్రం
నీకూ.. నాకూ.. చేరువైన ఈ వరసలు మారి
నీతో సాగే మనసు నిన్ను కోరీ
మగసిరికీ.. సొగసరికీ
మది కలిసే సుముహూర్తంలో
నాలో ఏం జరిగిందో.. ఏమో.. I Am In Love
నాలో ఏం జరిగిందో.. ఏమో.. I Am In Love
బిందే లోతుల్లోనా.. రింగే తీసే సీనూ
గుండె లోతుల్లోంచి.. లాగిందంట నన్నూ
మనసే.. చిటికెన వేలై కలిసే.. ప్రేమకు వేళై
రోజు చూస్తూ ఉంది.. నీకై వేయి కళ్లై
నువ్వూ.. నేనూ ఆగలేని ఈ తొందర తెలిసే
గుండెల్లోనే.. మంటపాలు వెలిసే
విరిసిన ఈ.. తలపులిలా కురిసెనులే.. అక్షింతలుగా
నాలో ఏం జరిగిందో.. ఏమో.. I Am In Love
నాలో ఏం జరిగిందో.. ఏమో.. I Am In Love
Reactions

Post a Comment

0 Comments