Panchadaara Song Lyrics Magadheera Movie (2009)




Panchadaara Song Lyrics Magadheera Movie (2009)

Movie:  Magadheera
Lyrics:  Chandrabose
Music:  M M Keeravani
Singers :  Anooj Guruvala, Rita


పంచదార బొమ్మా బొమ్మా పట్టుకోవద్దనకమ్మా
మంచుపూల కొమ్మా కొమ్మా ముట్టుకోవద్దనకమ్మా
చేతినే తాకొద్దంటే చెంతకె రావొద్దంటే యేమవుతానమ్మా
నిన్ను పొందేటందుకె పుట్టానె గుమ్మ
నువ్వు అందకపోతె వృధా ఈ జన్మ
నువ్వు అందకపోతె వృధా ఈ జన్మ ...

పువ్వుపైన చెయ్యేస్తే కసిరి నన్ను తిట్టిందే
పసిడి పువ్వు నువ్వని పంపిందే
నువ్వు రాకు నా వెంట
ఈ పువ్వు చుట్టు ముళ్ళంట
అంటుకుంటే మంటే వొళ్ళంతా
తీగ పైన చెయ్యేస్తె తిట్టి నన్ను నెట్టిందే
మెరుపు తీగ నువ్వని పంపిందె
మెరుపు వెంట ఉరుమంట ఉరుము వెంట వరదంట
నే వరద లాగ మారితె ముప్పంటా
వరదైనా వరమని వరిస్తానమ్మ ఆఆ ఆఆ
మునకైనా సుఖమని ముడేస్తానమ్మా ఆ ఆఆ
నిన్ను పొందేటందుకె పుట్టానె గుమ్మ
నువ్వందకపోతె వృధా ఈ జన్మ...

గాలి నిన్నుతాకింది నేల నిన్ను తాకింది
నేను నిన్ను తాకితే తప్పా
గాలి వూపిరయ్యింది నేల నన్ను నడిపింది
ఏమిటంట నీలోని గొప్ప ..
వెలుగు నిన్ను తాకింది చినుకు కూడ తాకింది
పక్షపాతమెందుకె నాపైన ..
వెలుగు దారి చూపింది చినుకు లాల పోసింది
వాటితోటి పొలిక నీకేల ..
అవి బతికున్నప్పుడె తోడుంటాయమ్మ
నీ చితిలో తోడై నేనొస్తానమ్మ
నిన్ను పొందేటందుకె పుట్టానె గుమ్మా
నువ్వందకపోతె వృధా ఈ జన్మ ...

Reactions

Post a Comment

0 Comments