Mandaara Mandaara Song Lyrics Bhaagamathie Movie (2017)
Movie: Bhaagamathie
Lyrics: Sreejo
Music: S S Thaman
Singer: Shreya Ghoshal
Cast: Anushka
మందార మందార
కరిగే తెల్లారేలా
కిరణాలే నన్నే చేరేలా
కళ్లారా కళ్లారా
చూస్తున్నా కళ్లారా
సరికొత్త స్నేహం దరిచేరా
అలికిడి చేసే నాలో అడగని ప్రశ్నేఏదో
అసలది బదులో
ఏమో అది తేలేనా
కుదురుగా ఉండే మదిలో
చిలిపిగా ఎగిరే ఎదలో
తెలియని భావం తెలిసే కథ మారేనా
నీ వెంట అడుగే వేస్తూ
నీ నీడనై గమనిస్తూ
నా నిన్నల్లో లేని నన్నే ఇలాగ
నీలో చూస్తున్నా
మందార మందార
కరిగే తెల్లారేలాగా
ఆ కిరణాలే నన్నే చేరేలా
కళ్లారా కళ్లారా
చూస్తున్నావా కళ్లారా
సరికొత్త స్నేహం దరిచేరా
సుందార… మందార… కళ్లారా… సుందార..
మందార మందార
కరిగే తెల్లారేలా
కిరణాలే నన్నే చేరేలా
ఉనికిని చాటే ఊపిరి కూడా
ఉలికి పడేలా ఉందే ఇలా
కలలోనైనా కలగనలేదే
విడిపోతుందని అరమరికా…
కడలై నాలో నువ్వే
అలనై నీలో నేనే
ఒకటై ఒదిగే క్షణమే అది ప్రేమేనా
కాలాలనే మరిపిస్తూ
ఆనందమే అందిస్తూ
నా ప్రయాణమై నా గమ్యానివై
నా నువ్వవుతున్నావే
మందార మందార
కరిగే తెల్లారేలాగా
ఆ కిరణాలే నన్నే చేరేలా
కళ్లారా కళ్లారా
చూస్తున్నావా కళ్లారా
ఈ సరికొత్త స్నేహం దరిచేరా
మందార మందార
కరిగే తెల్లారేలా
కిరణాలే నన్నే చేరేలా

0 Comments