O Manasa (Female) Song Lyrics Oka Manasu Movie (2016)


O Manasa (Female) Song Lyrics Oka Manasu Movie (2016)

Movie:  Oka Manasu
Lyrics:  Ramajogayya Sastry
Music:  Suni Kashyap
Singer:  Shreya Ghoshal


ఓ మనసా చేరువగా .. రా ఇలా
నను నీలో ఆపుతూ
వెళ్లిపొమ్మని తరిమేస్తావేలా
ఓ మనసా చేరువగా రా ఇలా
ఓ .. కలల చూపుసోకి వేరొక రూపులోకి
నాలోని ప్రేమరంగు మారిపోదుగా
నువ్వెంటో తెలిసినక ఇందాక వచ్చినాక
నీ జంట జాడ తప్ప దారి లేదుగా
ఓ మనసా చేరువగా .. రా ఇలా
నను నీలో ఆపుతూ
వెళ్లిపొమ్మని తరిమేస్తావేలా
ఓ మనసా చేరువగా .. రా ఇలా

ఊహించనేలేనే ఉండనేలేనే
నువ్వు లేనిదే నేనెలా
నీతోనే నీలోనే కలిపేశా నన్నే
పో పొమ్మనీ అనకలా
ఏనాడో నువు కూడా నేనయ్యావుగా
నిను నువ్వే కాదని వెలివేసే వీలంటూ ఉందా
ఓ మనసా చేరువగా .. రా ఇలా

వద్దన్నానని వద్దకొచ్చాను
ఈ జీవితం నీదని
చేరాను నా తీరం మూసేసా ద్వారం
నా మాటనే విననని
ఒక జననం ఒకటేనా ప్రేమకు
తుదివరకూ నీ కలే
మరణము దరి రాదంటా తనకు

ఓ మనసా చేరువగా .. రా ఇలా
ఓ .. కాలాల చూపుసోకి వేరొక రూపులోకి
నాలోని ప్రేమరంగు మారిపోదుగా
నువ్వెంటో తెలిసినాక ఇందాక వచ్చినాక
నీ జంట జాడ తప్ప దారి లేదుగా
ఓ మనసా చేరువగా .. రా ఇలా

Reactions

Post a Comment

0 Comments