Nee Kallathoti Song Lyrics Tulasi Movie (2007)
Movie : Tulasi
Lyrics : Bhaskara Bhatla
Music : Devi Sri Prasad
Singers: Sagar, Chitra
నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం
నీ చూపుతోటి నను తాకుతుంటే తనువంత సూర్యోదయం
ఇలాగే ఇలాగే మనం ఏకమయ్యే క్షణాలే కదా ఓ వరం
అలాగే అలాగే ప్రపంచాలు పలికే కధవ్వాలి మనమిద్దరం
నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం
నీ చూపుతోటి నను తాకుతుంటే తనువంత సూర్యోదయం
అడుగునవుతాను నీ వెంట నేను తోడుగా నడవగా చివరిదాకా
గొడుగునవుతాను ఇకపైన నేను వానలో నిన్నీలా తడవనీకా
నిన్నొదిలి క్షణమైన అసలుండలేను చిరునవ్వునవుతాను పెదవంచునా
నీ లేత చెక్కిళ్ళ వాకీళ్ళలోనే తొలి సిగ్గు నేనవ్వనా
నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం
నీ చూపుతోటి నను తాకుతుంటే తనువంత సూర్యోదయం
వెన్నెలవుతాను ప్రతి రేయి నేను చీకటే నీదరికి చేరకుండా
ఊపిరవుతాను నీలోన నేను ఎన్నడు నీ జతే వదలకుండా
నా రాణి పాదాలు ముద్దాడుకుంటూ నేనుండిపోతాను పారాణిలా
చిరు చెమట పడుతుంటే నీ నుదిటి పైనా వస్తాను చిరుగాలిలా

0 Comments