My Heart Is Beating Song Lyrics Jalsa Movie (2008)



My Heart Is Beating Song Lyrics Jalsa Movie (2008)

Movie:  Jalsa
Lyrics:  Sirivennela
Music:  Devi Sri Prasad
Singer:  KK

మై హార్ట్ ఈజ్ బీటింగ్ అదోలా తెలుసుకోవా అది
ఎన్నాళ్ళీ వెయిటింగ్ అనేలా తరుముతోంది మది
పెదవిపై పలకదే మనసులో ఉన్న సంగతి
కనులలో వెతికితే దొరుకుతుందీ
టీ స్పూన్ టన్ను బరువవుతుందే
ఫుల్ మూన్ నన్ను ఉడికిస్తుందే
క్లౌడ్ 9 కాళ్ళకిందకొచ్చిందే
లాండ్ మైన్ గుండెలో పేలిందే దే.. దే..
మై హార్ట్ ఈజ్ బీటింగ్ అదోలా తెలుసుకోవా అది
ఎన్నాళ్ళీ వెయిటింగ్ అనేలా తరుముతోంది మదీ

పెనుతుఫాను ఏదైనా మెరుపుదాడి చేసిందా
మునుపు లేని మైకానా మదిని ముంచి పోయిందా
ఊరికినే పెరగదుగా ఊపిరి సలపని భారమిలా
నీ ఉనికే ఉన్నదిగా నాలో నిలువెల్లా
తలపులలో చొరబడుతూ గజిబిజిగా చెలరేగాలా
తలగడతో తలబడుతూ తెల్లార్లు ఒంటరిగా వేగాలా
సెల్ ఫోన్ నీ కబురు తెస్తుంటే స్టెన్ గన్ మోగినట్టు ఉంటుందే
క్రాంప్టన్ ఫాను గాలి వీస్తుంటే సైక్లోన్ తాకినట్టు ఉంటుందే దే.. దే..
మై హార్ట్ ఈజ్ బీటింగ్ అదోలా తెలుసుకోవా అది
ఎన్నాళ్ళీ వెయిటింగ్ అనేలా తరుముతోంది మదీ

ఎప్పుడెలా తెగిస్తానో నా మీదే నాకు అనుమానం
మాటల్లో పైకనేస్తానో నీ మీద ఉన్న అభిమానం
త్వరత్వరగా తరిమినదే పదపదమని పడుచు రథం
యదలయలో ముదిరినదే మదనుడి చిలిపి రిథం
గుసగుసగా పిలిచినదే మనసున మెరిసిన కలలవనం
తహతహగా తరిమినదే దం అరె దం అని తూలే ఆనందం
ఫ్రీడం దొరికినట్టు గాలుల్లో వెల్ కం పిలుపు వినిపిస్తుందే
బాణం వేసినట్టు ఏ విల్లో ప్రాణం దూసుకెళ్ళిపోతుందే దే.. దే..
మై హార్ట్ ఈజ్ బీటింగ్ అదోలా తెలుసుకోవా అదీ
ఎన్నాళ్ళీ వెయిటింగ్ అనేలా తరుముతోంది మదీ
Reactions

Post a Comment

0 Comments