Rivvuna Egire Guvva Movie Version Song Lyrics Janaki Weds Sriram Movie (2003)
Movie: Janaki Weds Sriram
Lyrics: Chaitanya Prasad
Music: Ghantadi Krishna
Singers: Tippu, Sunitha
Cast : Rohit Ghajala Rekha, Prema
రివ్వున ఎగిరే గువ్వా.. నీ పరుగులు ఎక్కడికమ్మా
రివ్వున ఎగిరే గువ్వా.. నీ పరుగులు ఎక్కడికమ్మా
మంచును తడిసిన పువ్వా నీ నవ్వులు ఎవ్వరివమ్మా
నీ రాజు ఎవ్వరంటా ఈ రోజే చెప్పమంటా
నీ రాజు ఎవ్వరంటా ఈ రోజే చెప్పమంటా
అల్లరి పిల్లకు నేడు వెయ్యాలి ఇక మెళ్ళొ తాడు
ముడివేసే సిరిగల మొనగాడు ఎవ్వరే వాడు
చక్కని రాముడు వీడు నీ వరసకు మొగుడవుతాడు
ఇల్లాలిని వదిలిన ఆ ఘనుడు ఈ పిరికోడు
ఆ క్రిష్ణుని అంశన వీడే నీ కొరకే ఇలా పుట్టాడే
గొపికలే వస్తే అటే పరిగేడతాడే
ఓ గడసరి పిల్లా నీ కడుపున కొడుకై పుడ్తానే
కుతురుగా పుట్టు నీ పేరే పెడతాలే
గొడవెందుకు బావతో వెళతావ
పద బావా పాల కోవా..
రివ్వున ఎగిరే గువ్వా నీ పరుగులు ఎక్కడికమ్మా
మంచును తడిసిన పువ్వా నీ నవ్వులు ఎవ్వరివమ్మా
నీ రాజు ఎవ్వరంటా ఈ రోజే చెప్పమంటా
చిటపట చినుకులు రాలి అవి చివరకు ఎటు చేరాలి
సెలయేరులు పారే దారుల్లో కొలువుండాలి
నిండుగ నదులే ఉరికే అవి చేరును ఏ ఈ దరికి
కలకాలం కడలిని చేరంగా పరిగెడతాయి
అట్టాగే నాతో నీవు నీతో నేను ఉండాలి
బ్రతుకంతా ఒకటై ఇలా జత కావాలి
మన బొమ్మల పెళ్ళి..నువ్వే మెళ్ళో తాళిని కడతావా
మరు జన్మకు కూడా ఇలా తోడుంటావా
ఓ బావా ఒట్టే పెడుతున్నా
నే కుడా ఒట్టేస్తున్నా
రివ్వున ఎగిరే గువ్వా నీ పరుగులు ఎక్కడికమ్మా
మంచును తడిసిన పువ్వా నీ నవ్వులు ఎవ్వరివమ్మా
నా రాజు నువ్వేనంటా ఈ రోజే తెలిసిందంట
నా రాజు నువ్వేనంటా ఈ రోజే తెలిసిందంట

0 Comments