Kaakki Chokka Song Lyrics Radha Movie (2017)


Kaakki Chokka Song Lyrics Radha Movie (2017)

Movie:  Radha
Lyrics:  Suresh Banisetti
Music:  Radhan
Singers:  M L R Karthikeyan, Ramee
Cast:  Sharwanand, Lavanya Tripathy, Aksha Pardanasy


ఒంటిమీదకొచ్చింది ఖాకి చొక్కా
కంటి రెప్పనైపోతా అందరికింకా
అడ్డమొస్తే ఎవ్వడైన అరటి తొక్క
సీను లోకి నేనొచ్చి విజిలే కొడితే
రాజులకే రారాజు ఏం ఖతర్నాక్ ఫోజు
వీడితోటి పెట్టుకుంటే అరే పగిలిపోద్ది గాజు
హే వీడ్ని గాని ముట్టుకుంటే పేలిపోద్ది ఫ్యూజు
పోలీస్ డ్రెస్ అంటే వీడికెంత మోజు మోజు...
అల్ ఎవ్రీ బడీ సే కృష్ణ

లాఠీని పట్టి అచ్చం ఫ్లూట్ లా
ఏం ఊదుతున్నాడో చూడు
చేతుల్లో పిస్తోల్ నే చక్రంలా
ఏం తిప్పుతున్నాడో వీడు
కృష్ణా నీకు పెద్ద సెల్యూట్ ఖాకీ నిచ్చావే
నా దారికే రెడ్ కార్పెటేసి బ్లెస్సింగ్ ఇచ్చావే
పోలీస్ లంటే సెక్యూరిటీ గార్డ్
పొలికలోన ఈక్వల్ టు గాడ్
వాడే తోడుండగా ఈ లోకమే గోకులమైపోదా
రాజులకే రారాజు ఏం ఖతర్నాక్ ఫోజు
వీడితోటి పెట్టుకుంటే అరే పగిలిపోద్ది గాజు
వదిలించేయ్ దునియాకే
తెగ అంటుకున్న గ్రీజ్
ఎవడైనా పాకెట్ లో పెట్టుకోడా నీ ఇమేజ్

శ్రీ కృష్ణ దుష్ట శిక్షణకై కార్యోన్ముఖుడవు

అల్ ఎవ్రీ బడీ సే కృష్ణ

కేడిలతోటి ఆడేస్తాను అచ్చంగా టెంపుల్ రన్
ఆడెంత పెద్ద డానే ఐనా తినిపిస్తా శారిడాన్
భగవద్గీతే చేతికిచ్చి అందరితో చదివిస్తా
కాదనిన గీతే దాటినోడి రాతని మార్చేస్తా
అల్లరి తోటి మేజిక్ చేయాలి
అందరి గుండె మ్యూజిక్ చెయ్యాలి
అబ్ సే ప్రపంచమే సరికొత్తగ సన్ రైజ్ చూడాలి
అయ్ బాబోయ్ మా వాడ్ని అరె గెలకవద్దు ప్లీజ్
అర సెకండే ఆగడుగా ఏ చాప్టర్ అయినా క్లోజ్
మంచితనం వడపోస్తే వీడికేగా ఫస్ట్ ప్రైజ్
మొండితనం చిటికేస్తే జ్నికరంగా కింగ్ సైజు
Reactions

Post a Comment

0 Comments