Premante Yemitante Song Lyrics Seenu Movie (1999)

Premante Yemitante Song Lyrics Seenu Movie (1999)

Movie    :  Seenu
Lyrics    :  Vennelakanti
Music    :  Manisharma
Singers  :  Hariharan, Sujatha
Cast     :  Venkatesh, Twinkle Khanna

ప్రేమంటే ఏమిటంటే నిను ప్రేమించినాక తెలిసే
మనసంటే ఏమిటంటే అది నీకివ్వగానె తెలిసే
ప్రేమంటే ఏమిటంటే నిను ప్రేమించినాక తెలిసే
మనసంటే ఏమిటంటే అది నీకివ్వగానె తెలిసే
ఇదివరకు తెలియంది ఈ అనుభవం
ఎద మేలుకొలిపింది ఈ పరిచయం
ఓ...ఓ...ఓ...ఓ...ఓ...ఓ…
ప్రేమంటే ఏమిటంటే నిను ప్రేమించినాక తెలిసే

నీ కళ్ళ వాకిళ్లలో తలుపు తెరిచెను ప్రేమ...ప్రేమ
మోహాల ముంగిళ్లలో వలపు కురిసెను ప్రేమ...ప్రేమ
ఈనాడే తెలిసింది తొలిసారిగా యెంత తీయంది ప్రేమని
ఆకాశ దీపాలు ఇల చేరగా తెర తీసింది ఆమని
ఇది సంగీతమో తొలి సంకేతమో
ఇది ప్రియగీతమో మధు జలపాతమో…
ప్రేమంటే ఏమిటంటే నిను ప్రేమించినాక తెలిసే
మనసంటే ఏమిటంటే అది నీకివ్వగానె తెలిసే

ఏనాడు ఏ దేవతో మనను కలిపిన వేళ...వేళ
ఈనాడు ఈ దేవితో మనసు తెలిపెను చాల..చాల
కాలాలు ఓకసారి ఆగాలిలే మన తొలిప్రేమ సాక్షిగా
లోకాలు మన వెంట సాగాలిలే మన ప్రేమికుల తోడుగా
ఇది ఆలాపనో మది ఆరాధనో
మన సరసాలకే తొలి సంకీర్తనో….
ప్రేమంటే ఏమిటంటే నిను ప్రేమించినాక తెలిసే
మనసంటే ఏమిటంటే అది నీకివ్వగానె తెలిసే
ఇదివరకు తెలియంది ఈ  అనుభవం
ఎద మేలుకొలిపింది ఈ పరిచయం
ఓ...ఓ...ఓ...ఓ...ఓ...ఓ…
ప్రేమంటే ఏమిటంటే నిను ప్రేమించినాక తెలిసే

Reactions

Post a Comment

0 Comments