Pileche Song Lyrics Khaleja Movie (2010)



Pileche Song Lyrics Khaleja Movie (2010)

Movie:  Khaleja
Lyrics:  Sirivennela
Music:  Manisharma
Singers :  Hemachandra, Swetha


మీటీ మీటీ ధున్ వొ భజాయే
రాధాకే మన్ ఖొ లుభాయే
గోపీ భోలే గిరిధర్ నందలాలా నందలాలా
మీటీ మీటీ ధున్ వొ భజాయే
రాధాకే మన్ ఖొ లుభాయే
గోపీ భోలే గిరిధర్ నందలాలా నందలాలా
గోపీ భోలే గిరిధర్ నందలాలా
పిలిచే... పెదవుల పైన నిలిచే... మెరుపు నువ్వేనా
పిలిచే... పెదవుల పైన నిలిచే... మెరుపు నువ్వేనా
నువ్వు చేరి నడి ఎడారి నందనమై విరిసిందా
తనలో అనంద లహరి సందడిగా ఎగసిందా
నడిచిన ప్రతి దారి నదిగా మారి మురిసినదా ముకుందా
కాలం మేను మరచి జ్ఞాపకాల్లో జారిపోయిదా
లోకం గోకులంలా మారిపోయి మాయ జరిగిందా
ఊరంతా ఊగిందా నీ చెంతా చేరిందా గోవిందా
పిలిచే... పెదవుల పైన నిలిచే...మెరుపు నువ్వేన

ఈ భావం నాదేనా... ఈనాడే తోచేనా...
చిరునవ్వోటి పూసింది నా వల్లనా
అది నావెంటే వస్తోంది ఎటు వెళ్ళినా
మనసును ముంచేనా మురిపించేనా మధురమే ఈ లీల
నాలో ఇంతకాలం ఉన్న మౌనం ఆలపించిందా
ఏకాంతాన ప్రాణం బృందగానం ఆలకించిందా
ఊరంతా ఊగిందా నీ చెంత చేరిందా గోవిందా
జుమ్మా రె జుమ్మా రె జుమ్మా రె ఓ గిరిధర్
జుమ్మా రె జుమ్మా రె జుమ్మా రె ఓ గిరిధర్
జుమ్మా రె జుమ్మా రె జుమ్మా రె ఓ గిరిధర్
జుమ్మా రె జుమ్మా రె జుమ్మా రె ఓ గిరిధర్
జుమ్మా రె జుమ్మా రె జుమ్మా గిరిధర్ జుమ్మా జుమ్మా
జుమ్మా రె జుమ్మా రె జుమ్మా జుమ్మా రె జుమ్మా రె జుమ్మా
జుమ్మా రె జుమ్మా రె జుమ్మా గిరిధర్ జుమ్మా జుమ్మా
జుమ్మా రె జుమ్మా రె జుమ్మా జుమ్మా రె జుమ్మా రె జుమ్మా
యారొ మురళి భజావే గిరిధర్ గోపాలా
భజాకే మనుఖొ చురాలే గిరిధా నందలాలా

నా చూపే చెదిరిందా నీ వైపే తరిమిందా
చిన్ని కృష్ణయ్య పాదాల సిరి మువ్వలా
నన్ను నీ మాయ నడిపింది నలు వైపులా
అలజడి పెంచేనా అలరించేనా లలనను ఈ వేళ
ఏదో ఇంద్రజాలం మంత్రమేసి నన్ను రమ్మందా
ఎదలో వేణు నాదం వూయాలుపి ఊహ రేపిందా
ఊరంతా ఊగిందా నీ చెంత చేరిందా గోవిందా
పిలిచే... పెదవుల పైన నిలిచే... మెరుపు నువ్వేనా

Reactions

Post a Comment

0 Comments