Ok Anesa Song Lyrics Kotha Bangaru Lokam Movie (2008)
Movie: Kotha Bangaru Lokam
Lyrics: Sirivennela
Music: Mickey J Meyer
Singers : Naresh Iyer, Kalyani
ఓకే అనేసా దేఖో నా భరోసా
నీకే వదిలేసా నాకెందుకులే రభసా
ఓకే అనేసా దేఖో నా భరోసా
నీకే వదిలేసా నాకెందుకులే రభసా
భారమంతా నేను మోస్తా అల్లుకో ఆశాలత
చేరదీస్తా సేవ చేస్తా రాణిలా చూస్తా
అందుకేగా గుండెలో నీ పేరు రాసా
తెలివనుకో తెగువనుకో మగ జన్మ కదా
కథ మొదలనుకో తుది వరకు నిలబడగలదా
ఓకే అనేశా దేఖో నా భరోసా
నీకే వదిలేసా నాకెందుకులే రభసా
ఓకే అనేశా దేఖో నా భరోసా
నీకే వదిలేసా నాకెందుకులే రభసా
పరిగెడదాం పదవే చెలీ ఎందాకా అన్నానా
కనిపెడదాం తుది మజిలీ ఎక్కడున్నాం
ఎగిరెళదాం ఇలనొదిలి ఎవరాపినా
మరో సారి అను ఆ మాట మహారాజునైపోతాగా
ప్రతి నిమిషం నీ కోసం
ప్రాణం సైతం పందెం వేసేస్తా
పాత ఋణమో కొత్త వరమో
జన్మ ముడి వేసిందిలా
చిలిపి తనమో చెలిమి గుణమో ఏమిటీ లీల
స్వప్న లోకం ఏలుకుందాం రాగమాలా
అదిగదిగో మదికెదురై కనబడలేదా
కథ మొదలనుకో తుది వరకు నిలబడగలదా
పిలిచినదా చిలిపి కల వింటూనే వచ్చేశా
తరిమినదా చెలియనిదా పరుగుతీశా
వదిలినదా బిడియమిలా ప్రశ్నల్ని చెరిపేశా
ఎదురవదా చిక్కు వల ఎటో చూశా
భలేగుందిలే నీ ధీమా భరిస్తుందిలే ఈ ప్రేమ
అదరకుమా బెదరకుమా
పరదా విడిరా సరదాపడదామా
పక్కనుంటే ఫక్కుమంటూ నవ్వినాడా ప్రియతమా
చిక్కులుంటే బిక్కుమంటూ లెక్క చేస్తామా
చుక్కలన్నీ చిన్నబోవా చక్కనమ్మా
మమతనుకో మగతనుకో మతి చెడిపోదా
కథ మొదలనుకో తుది వరకు నిలబడగలదా

0 Comments