O Rangula Chilaka Song Lyrics Jayammu Nischayammu Ra Movie (2016)


O Rangula Chilaka Song Lyrics Jayammu Nischayammu Ra Movie (2016)

Movie:  Jayammu Nischayammu Ra
Lyrics:  Ramanjaneyulu
Music:  Ravichandra
Singer:  Spandhana


ఓ రంగుల చిలకా చూడే నీ ఎనకా
అలుపంటూ లేనీ ఈ పిల్లడి నడకా
ఓ బంగరు తళుకా చుట్టూ ఏం కనకా
ఎక్కడికే ఆ అడుగుల చప్పుడు వినకా
ఓసారిటు చూడే పాపం పసివాడే
నీ చూపుల కోసం వేచీ ఉన్నాడే
అన్నీ వదిలేసి నిన్నే వలచాడే
నీ తలపుల్లోనే నిదురే మరిచాడే

ఓమాటలన్నీ పక్కన వదిలాడే
మొండిగా నిన్ను వీడక ముందుకు కదిలాడే
ఎవరుఎమనుకున్న తానేమనుకోడే
అంతగా నీ ప్రేమలో మైమరపయ్యాడే
ఓసారిటు చూడే పాపం పసివాడే
నువ్వంటూ లేని ధ్యాసే లేనోడే
బిడియము కలవాడే హృదయము అలాలీడే
ఐన నిన్ను గెలిచే మనసే ఉన్నోడే

నిన్నందరికంటే మిన్నగ చూస్తాడే
నిన్నెవరేమన్నా యుద్ధం చేస్తాడే
నీతో నడిచే ఆ ఏడడుగుల కోసం
వేవేలడుగులనైనా నడిచే ఘనుడే
ఓసారిటు చూడే పాపం పసివాడే
నువ్ నడిచే దారిని వదలని ప్రేమికుడే
గుండే తలుపుల్నే తెరిచీ ఉంచాడే
దేవత నువ్వంటూ భక్తుడు అయ్యాడే

Reactions

Post a Comment

0 Comments