Nenu Nuvvantu Song Lyrics Orange Movie (2010)



Nenu Nuvvantu Song Lyrics Orange Movie (2010)

Movie:  Orange
Lyrics:  Vanamali
Music:  Haris Jayaraj
Singer:  Naresh Iyer


నేను నువ్వంటూ వేరై ఉన్నా
నాకీవేళా నీలో నేనున్నట్టుగా
అనిపిస్తూ ఉందే వింతగా
నాకోసం నేనే వెతికేంతగా  ఓ గర్ల్..
నువ్వే లేకుంటే లిసన్ గర్ల్.. ఏమౌతానో..ఓఓ..
నీ స్నేహాన్నే కావాలంటున్నానుగా
కాదంటే నామీదొట్టుగా
ఏమైనా చేస్తా నమ్మేట్టుగా

ఒకసారి చూసి నే వలచానా
నను వీడిపోదు ఏ మగువైనా
ప్రేమిస్తానే ఎంతో గాఢంగా... గాగా..
నా ప్రేమలోతులో మునిగాకా
నువు పైకి తేలవే సులభంగా
ప్రాణాలైనా ఇస్తావేకంగా

నేను నువ్వంటూ వేరై ఉన్నా
నాకీవేళా నీలో నేనున్నట్టుగా
అనిపిస్తూ ఉందే వింతగా
నాకోసం నేనే వెతికేంతగా

నిజాయితీ ఉన్నోడినీ
నిజాలనే అన్నోడినీ
అబద్దమే రుచించనీ అబ్బాయినీ
ఒకే ఒక మంచోడినీ
రొమాన్సులో పిచ్చోడినీ
పర్లేదులే ఒప్పేసుకో సరేననీ
ముసుగేసుకోదు ఏనాడూ.. ఓఓ..
నా మనసే ఓ భామా .. ఓఓ..
నను నన్నుగానే చూపిస్తూ
కాదన్నా పోరాడేదే నా ప్రేమా ఓఓ..
నేను నువ్వంటూ వేరై ఉన్నా
నాకీవేళా నీలో నేనున్నట్టుగా
అనిపిస్తూ ఉందే వింతగా
నాకోసం నేనే వెతికేంతగా

తిలోత్తమా తిలోత్తమా
ప్రతీక్షణం విరోధమా
ఇవాళ నా ప్రపంచమే నువ్వే సుమా
ఓ ఓ గ్రహాలకే వలేసినా
దివే అలా దిగొచ్చినా
ఇలాంటి ఓ మగాడినే చూళ్ళేవమ్మా
ఒకనాటి తాజ్ మహలైనా
నా ముందూ పూరిల్లే
ఇకపైన గొప్ప ప్రేమికుడై
లోకంలో నిలిచే పేరే నాదేలే...ఓఓఓ..
నేను నువ్వంటూ వేరై ఉన్నా
నాకీవేళా ఆఆఅ.. నీలో నేనున్నట్టుగా
అనిపిస్తూ ఉందే వింతగా
నాకోసం నేనే వెతికేంతగా

నువ్వే లేకుంటే ఏమౌతానో
నీ స్నేహాన్నే ఏఏఏఏ.. కావాలంటున్నానుగా
కాదంటే నామీదొట్టుగా
ఏమైనా చేస్తా నమ్మేట్టుగా
ఒకసారి చూసి నే వలచానా
నను వీడిపోదు ఏ మగువైనా
ప్రేమిస్తానే ఎంతో గాఢంగా
నా ప్రేమలోతులో మునిగాకా
నువు పైకి తేలవే సులభంగా
ప్రాణాలైనా ఇస్తావేకంగా
ఓఓ...ఓఓ... నానానా..నానన్నాన్నా...హో...

Reactions

Post a Comment

0 Comments