Nee Kanti Choopulloo Song Lyrics Legend Movie (2014)

Nee Kanti Choopulloo Song Lyrics Legend Movie (2014)

Movie:  Legend
Lyrics:  Ramajogayya Sastry
Music:  Devi Sri Prasad
Singers:  Vijay Yesudas, Chitra

నీ కంటి చూపుల్లోకి నా ప్రాణం చేరిందే ఏ మాయ చేసావే...
నీ వెండి వెన్నెల్లోకి నా గుండె జారిందే ఏం మంత్ర మేసావే...
సమయమే ఇక తెలియనంతగా మనసు నటు ఇటు కమ్మేసావే...
పలుయుగాలకు తనివి తీరని కళలు తలుపులు తెరిచినావే...
నీ కంటి చూపుల్లోకి నా ప్రాణం చేరిందే ఏ మాయ చేసావే...
నీ వెండి వెన్నెల్లోకి నా గుండె జారిందే ఏం మంత్ర మేసావే ఓ...

చూసే కొద్ది చూడాలంటూ చూపు నీ వైపు పోనీకుండా పట్టేసావే...
ఇచ్చే కొద్ది ఇవ్వాలంటూ నాకై నేనే నువ్వైపొయెలా చుట్టేసావే...
ఒంటరైన లోకం నిండిపోయే నీవుగా...
ఇప్పుడున్న కాలం ఎప్పుడైనా లేదుగా...
ఊపిరిలో చిరునవ్వల్లె నీకోసం నేనే ఉన్నా...
నా ప్రేమ దేశం నీకు రాసిచ్చుకున్నా...
నీ కంటి చూపుల్లోకి నా ప్రాణం చేరిందే ఏ మాయ చేసావే...
నీ వెండి వెన్నెల్లోకి నా గుండె జారిందే ఏం మంత్ర మేసావే ఓ...

ఏదో ఉంది ఎంతో ఉంది సూటి బాణాలు గుప్పించేటి నీ రూపులో...
నాదేముంది అంతా నీది మెరుగు పట్టావే అందన్నిలా నీ చూపుతో...
చిచ్చు పెట్టినావే వెచ్చనైన శ్వాసలో...
గూడు కట్టినావే గుప్పెడంత ఆశలో...
తెల్లారే ఉదయాలన్నీ నీతోనే మొదలై పోని...
నీ జన్మ హక్కైపోని నా రోజులన్నీ...
నీ కంటి చూపుల్లోకి నా ప్రాణం చేరిందే ఏ మాయ చేసావే...
నీ వెండి వెన్నెల్లోకి నా గుండె జారిందే ఏం మంత్ర మేసావే ఓ...

Reactions

Post a Comment

0 Comments