Manasa Mannichamma Song Lyrics Aadavari Matalaku Ardhale Verule Movie (2007)


Manasa Mannichamma Song Lyrics Aadavari Matalaku Ardhale Verule Movie (2007)

Movie    :  Aadavari Matalaku Ardhale Verule
Lyrics    :  Sirivennela
Music    :  Yuvan Shankar Raja
Singer:  Karthik


మనస మన్నించమ్మ మార్గం మల్లించమ్మ
నీతొ రాని నిన్నల్లోనె శిలవై ఉంటావా
స్వప్నం చెదిరిందమ్మ సత్యం ఎదరుందమ్మ
పొద్దేలేని నిద్దర్లోనె నిత్యం ఉంటావా

ప్రేమా ప్రేమా నీ పరిచయం
పాపం అంటే కాదనలేవా
ప్రేమా ప్రేమా నీ పరిచయం
పాపం అంటే కాదనలేవా

ప్రేమాలయంల ఉంటె నీ తలపు
ప్రేమె దైవంల కొలువుంటుందమ్మా
దావానలంల తరిమె నిట్టూర్పు
ప్రేమను నీ నుంచి వెలివేస్తుందమ్మా
అంత దూరం వుంటేనె చందురుడు చల్లని వెలుగమ్మ
చెంతకొస్తె మంటేనె అందడని నిందించొద్దమ్మ
మన క్షేమం కోరుకునె జాబిలె చెలిమికి చిరునామా
తన సౌఖ్యం ముఖ్యమనె కాంక్షలొ కలవర పడకమ్మా
ప్రేమా ప్రేమా నీ స్నేహమే
తీరని శాపం అనిపిస్తావ

ఒక చినుకునైన దాచదు తన కోసం
నేలకు నీరిచ్చి మురిసె ఆకాశం
నదులన్ని తానె తాగె ఆరాటం
కడలికి తీర్చేన దాహం ఏమాత్రం
పంజరంలో బంధించి ఆపకె నేస్తానేనాడు
పల్లకీపై పంపించి చల్లగ దీవించవె నేడు
జ్ఞాపకంలొ తియ్యదనం చేదుగ మార్చవ కన్నీళ్ళు
జీవితంలొ నీ పయనం ఇక్కడె ఆపకు నూరేళ్ళు
ప్రేమా ప్రేమా మదిలొ భారం
కరిగించేల ఓదార్చవా

Reactions

Post a Comment

0 Comments