Kanapadaleda Song Lyrics Bunny Movie (2005)
Movie: Bunny
Lyrics: Suddhala Ashok Teja
Music: Devi Sri Prasad
Singer: SP Balu
కనపడ లేదా గోదారి తల్లి కడుపుకోత
వినబడలేద గోదారి నీళ్ళ రక్తఘోష
కనపడ లేదా గోదారి తల్లి కడుపుకోత
వినబడలేద గోదారి నీళ్ళ రక్తఘోష
గుండె నిండ పాలున్న బిడ్డల కందించలేని
తల్లి బ్రతుకుదేనికని
బీళ్ళు నింపె నీళ్ళున్న సముద్రాన పడిపోయె శాపం తనకెందుకని
బరువై దయకరువై తనవెలుగె ఇక బలియై
బరువై దయకరువై తనవెలుగె ఇక బలియై
ఉప్పుసాగరాలలోకి వెళ్ళలేక వెళ్ళలేక
వెక్కివెక్కిపడుతున్నది ఉమాగ కనుమూయలేక
వెక్కివెక్కిపడుతున్నది ఉమాగ కనుమూయలేక
ఆ అలల అలజడి ఆతడి ఆరని కంటితడి
ఆ అలల అలజడి ఆతడి ఆరని కంటితడి
కనబడలేదా వినబడటంలేదా
కనపడ లేదా గోదారి తల్లి కడుపుకోత
వినబడలేద గోదారి నీళ్ళ రక్తఘోష
శిలా పలక లేసి మీరు ఎలా మరచిపోయారని
బాసరలో సరస్వతి పీఠమెక్కి అడిగినది
ధుర్మదాంధ్రులారా తెలుగు బిడ్డలకీ కర్మేందని
ధర్మపురిలో నారసింహ నాధం చేస్తున్నది
ఎడారులుగ మారుతున్న పొలాలను చూడలేక
కాళేశ్వర శివలింగం కాళ్ళు కడిగి ఏడ్చినది
పలుగు మోయలేని రైతు ఆత్మహత్యలను చలించి
భద్రాచల రాముడికి సాగిలపడి మొక్కినది
పాపి కొండల గుండె ధారై ప్రవహించినది
ధవళేశ్వకాటన్ మహాశైలి తలచినది
సిగ్గుపడండని కుటిల నాయకులని తిట్టినది
గుండె పగిలి నర్సాపూర్ సముద్రాన దూకినది
కనపడ లేదా గోదారి తల్లి కడుపుకోత
వినబడలేద గోదారి నీళ్ళ రక్తఘోష

0 Comments