Inthaku Nuvvevaru Song Lyrics Snehituda Movie (2009)
Movie: Snehituda
Lyrics: Basha Sri
Music: Sivaram Shankar
Singer: Shreya Ghoshal
ఇంతకు నువ్వెవరు వరసకు నాకెవరు
అంతగా గుచ్చి గుచ్చి చెప్పేటందుకు నేనెవరు
ఇంతకు ముందెవరు ఇంతగా నాకెవరు
చెంతకు వచ్చి వచ్చి చెప్పినవారే లేరెవరు
ఒక నిముషము కోపంతో మరు నిముషము నవ్వులతో
నను మురిపిస్తావో మరిపిస్తావో ఎందుకో
నీ పంతము ఏమిటని ఏ బంధము మనది అని
నేనాలోచిస్తే బదులే దొరకదు ఎంతకు
ఇంతకు నువ్వెవరు వరసకు నాకెవరు
అంతగా గుచ్చి గుచ్చి చెప్పేటందుకు నేనేవరు
ఎందుకో ఏమిటో నేను చెప్పలేనుగానీ
కలిసావు తియ్యనైన వేళ
చనువుతో చిలిపిగా నీవే మసులుతుంటే నాతో
మరిచాను గుండెలోని జ్వాల
ఓ తొలకరి స్నేహమా నేస్తమా ఏమి మాయో ఇది
నీ అడుగుల నీడలో కాలమే నిలిచి చూస్తున్నదీ
ఇంతకు నువ్వెవరు వరసకు నాకెవరు
అంతగా గుచ్చి గుచ్చి చెప్పేటందుకు నేనెవరు
ఎవరని చూడక నాకై పరుగు తీస్తు ఉంటే
నీ పేరే ఆశ రేపే నాలో
నువ్వలా కసురుతూ నాకే అదుపు నేర్పుతుంటే
చూసాలే నన్ను నేను నీలో
ప్రియమైన సమయమా గమనమా చెప్పవే అతనికి
ఈ చిరు చిరు పయనమే మధురమై నిలిచిపోతుందనీ
ఇంతకు నువ్వెవరు వరసకు నాకెవరు
అంతగా గుచ్చి గుచ్చి చెప్పేటందుకు నేనెవరు
ఒక నిముషము కోపంతో మరు నిముషము నవ్వులతో
నను మురిపిస్తావో మరిపిస్తావో ఎందుకో
నీ పంతము ఏమిటని ఏ బంధము మనది అని
నేనాలోచిస్తే బదులే దొరకదు ఎంతకు

0 Comments