Enduke Ila Song Lyrics Sambaram Movie (2003)
Movie: Sambaram
Lyrics: Sirivennela
Music: R P Patnaik
Singer: R P Patnaik
ఎందుకే ఇలా గుండె లోపల ఇంత మంట రేపుతావు అందని కలా
అన్ని వైపులా అల్లుకోకిలా ఆగనీక సాగనీక ఎన్నాళ్ళిలా
వెంటాడుతు వేధించాలా మంటై నను సాధించాలా
కన్నీటిని కురిపించాలా ఙ్ఞాపకమై రగిలించాలా
మరుపన్నదే రానీయవా దయలేని స్నేహమా
ఎందుకే ఇలా గుండె లోపల ఇంత మంట రేపుతావు అందని కలా
అన్ని వైపులా అల్లుకోకిలా ఆగనీక సాగనీక ఎన్నాళ్ళిలా
తప్పదని నిను తప్పుకొని వెతకాలి కొత్తదారి
నిప్పులతో మది నింపుకుని బ్రతకాలి బాటసారి
జంటగా చితిమంటగా గతమంత వెంట ఉందిగా
ఒంటిగా నను ఎన్నడు వదిలుండనందిగా
నువ్వూ నీ చిరునవ్వు చేరని చోటే కావాలి
ఉందో లేదో ఈ లోకంలో నీకే తెలియాలి
ఎందుకే ఇలా గుండె లోపల ఇంత మంట రేపుతావు అందని కలా
అన్ని వైపులా అల్లుకోకిలా ఆగనీక సాగనీక ఎన్నాళ్ళిలా
ఆపకిలా ఆనాటి కల అడుగడుగు తూలిపోగా
రేపకిలా కన్నీటి అల ఏ వెలుగు చూడనీక
జన్మలో నువ్వు లేవని ఇకనైన నన్ను నమ్మని
నిన్నలో వదిలేయని ఇన్నాళ్ళ ఆశని
చెంతే ఉన్నా సొంతం కావని నిందించే కన్నా
నన్నే నేను వెలివేసుకొని దూరం అవుతున్నా
ఎందుకే ఇలా గుండె లోపలా ఇంత మంట రేపుతావు అందని కలా
అన్ని వైపులా అల్లుకోకిలా ఆగనీక సాగనీక ఎన్నాళ్ళిలా

0 Comments