Cheliya Song Lyrics SMS(Shiva Manasulo Shruti) Movie (2012)
Movie: SMS (SHIVA MANASULO SHRUTI)
Lyrics: Vanamali
Music: Yuvan Shankar Raja
Singer: Vijay Prakash
చెలియా నే ఇన్నాళ్ళు నా ప్రేమే చూశానమ్మ నీలో
ఇపుడీ తొలి కన్నీళ్లు ఎన్నాళ్ళు దాచాలింక నాలో
కొంచెం సుఖం.... కొంచెం ధుఖం...ఓ..
పంచేందుకే ప్రేమున్నదా ఓవు...ఓవు...ఓ...
చెలియా నే ఇన్నాళ్ళు నా ప్రేమే చూశానమ్మ నీలో
ఇపుడీ తొలి కన్నీళ్లు ఎన్నాళ్ళు దాచాలింక నాలో...
పొగరుకు రూపం నువ్వేనే పొరబడి స్నేహం చేశానే
మరువను మాత్రం మరిచానే....
నిప్పని తెలిసి నిలువెల్లా చొరవగ నిన్నే తాకానే
మంటలొ హాయిగ రగిలానే....
ఈ మనిషిని చంపే విషమైనా
కొంతసేపయ్యాకే ప్రాణం తీస్తుందే
ఈ ప్రేమ మాత్రం చిటికెలొ చంపుతుందే
ఇంతకన్నా వింత ఎక్కడైనా ఉందా...
చెలియా నే ఇన్నాళ్ళు నా ప్రేమే చూశానమ్మ నీలో
ఇపుడీ తొలి కన్నీళ్లు ఎన్నాళ్ళు దాచాలింక నాలో...
ఓవు...ఓవు...ఓ... ఓవు...ఓవు...ఓ... ఓవు...ఓవు...ఓ...
నీ కలకంటూ లేస్తానే నీ మాటొకటే వింటానే
నీతో నీడై వస్తానే...
నువ్విక దూరం అయ్యాకా మిగిలిన బతుకేం చెయ్యాలే
ఒంటరి వాణ్ణై పోయానే...
నీ పెదవులు తెలిపే చిరుమాటే
నా బతుకును నడిపే ఓ బాటే
నీ మౌనం వదిలెయ్ ఈ పూటే
ప్రేమంటేనే బాధా తీరే దారే లేదా....... " చెలియా "
0 Comments