Rojave Song Lyrics Suryavamsam Movie (1998)
Movie: Suryavamsam
Lyrics: Shanmkha Sharma
Music: S A Rajkumar
Singer: Hariharan
లాలలా లాలలా లాలలా లలలలాల లలలలాల
రోజావే చిన్ని రోజావే రాగాలే రువ్వే రోజావే

నాలో కదిలే ప్రాణాలే ఒక్క పాటై నిన్నే చేరాలే

ఆకాశం అందాలంటూ దూకే కెరటంలా ప్రేమే నాలో
ఆ హోరు నీ పేరునే పలికే మంత్రంలా నా గుండెలో
దారంతా చలువ పందిళ్ళే వేసి నీకోసం నీడై ఉన్నా
నాలో నేనే లేనే లేను నేను నిన్నే నాలో కొలువుంచాను
రోజావే చిన్ని రోజావే రాగాలే రువ్వే రోజావే
నాలో కదిలే ప్రాణాలే ఒక్క పాటై నిన్నే చేరాలే
మేరుపంటి నీ రాకకై మనసే మేఘంలా మారిందిలే
చిరుగాలై తలపే తాకి కదిలి నిలువెల్లా కరిగిందిలే
తొలి చినుకే తాకే నేలల్లె నేనే పులకించా నీ ఊహతో
రానే రావు ఓనమాలు కాని నీలో చదివా ప్రియ వేదాలు

0 Comments