Suryude Song Lyrics Stalin Movie (2006)


Suryude Song Lyrics Stalin Movie (2006)

Movie:  Stalin
Lyrics:  Suddala Ashok Teja
Music:  Manisharma
Singer:  SP Balu
Cast:  Chiranjeevi, Trisha



సూర్యుడే సెలవని అలసి పోయేనా
కాలమే శిలవలే నిలిచిపోయేనా
మనిషి మనిషిని కలిపిన ఓ ఋషి
భువిని చరితని నిలిపెను నీ కృషి
మహాశయా విధి పగై తరిమెనా
మహోష్ణమై రుధిరమే మరిగెనా
ఆగిపోయెనా త్యాగం కధ ఆదమరిచెనా దైవం వృధా
సూర్యుడే సెలవని అలసి పోయేనా
కాలమే శిలవలే నిలిచిపోయేనా

ఆకశం నినుగని మెరిసిపోతుంది
నేలనీ అడుగుకై ఎదురు చూసింది
చినుకు చినుకున కురిసెను నీ కల
మనస్సు మనస్సున రగిలెను జ్వాలలా
తుఫానులా ఎగిసెనీ ప్రవచనం
ప్రభోజ్వలా కదిలెనీ ఈ యువజనం
పంచభూతాలే తోడై సదా
పంచ ప్రాణాలై రావా పదా
ద్వయం భకం యజమహే సుగంధింపుష్టి వర్థనం
ఉర్వానుక హిమ బంధనా వృధ్యో వృక్షియమామృతా

స్వార్థమే పుడమిపై పరుగు తీస్తుంటే
ధూర్తులే అసురులై ఉరక లేస్తుంటే
యుగము యుగమున వెలిసెను దేవుడు
జగము జగములు నడిపిన ధీరుడు
మహొదయా అది నువ్వే అనుకొని
నిరీక్షతోనిలిచె ఈ జగతిని
మేలుకో రాదా మా దీపమై
ఏలుకో రాదా మా బంధమై

Reactions

Post a Comment

0 Comments