Minneti Sooreedu Song Lyrics Seeta Kokka Chilakka Movie (1981)
Movie : Seetakoka Chilaka
Lyrics : Veturi
Music : Ilayaraja
Singers : S P Balu, Vani Jairam
మిన్నేటి సూరీడు వచ్చేనమ్మా
పల్లె కోనెటి తామర్లు విచ్చేనమ్మా
మిన్నేటి సూరీడు వచ్చేనమ్మా
పల్లె కోనెటి తామర్లు విచ్చేనమ్మా
అందమైన రంగవల్లులై ఎండలన్ని పూలజల్లులై
ముద్దుకే పొద్దు పొడిచి
మిన్నేటి సూరీడు వచ్చేనమ్మా
పల్లె కోనెటి తామర్లు విచ్చేనమ్మా
ఓ చుక్క నవ్వవే వేగుల చుక్కా నవ్వవే
కంటి కోలాటాల జంట పేరంటాలా
ఓ చుక్క నవ్వవే నావకు చుక్క నవ్వవే
పొందు ఆరాటాల పొంగు పోరాటాలా
మొగ్గ తుంచుకుంటె మొగమాటాలా
బుగ్గ దాచుకుంటె బులపాటాలా
దప్పికంటె తీర్చడానికిన్ని తంటాలా
మిన్నేటి సూరీడు వచ్చేనమ్మా
పల్లె కోనెటి తామర్లు విచ్చేనమ్మా
మిన్నేటి సూరీడు వచ్చేనమ్మా
పల్లె కోనెటి తామర్లు విచ్చేనమ్మా
ఓ..... రామచిలకా చిక్కని ప్రేమ మొలక
గూడు ఏమందమ్మా ఈడు ఏమందమ్మా
ఈడుకున్న గూడు నువ్వె గోరింకా...
తోడుగుండిపోవె అంటి నీవింకా
పువ్వు నుంచి నవ్వునూ తుంచలేనులే యింక
మిన్నేటి సూరీడు మిన్నేటి సూరీడు
మిన్నేటి సూరీడు వచ్చేనమ్మా
పల్లె కోనెటి తామర్లు విచ్చేనమ్మా
అందమైన రంగవల్లులై ఎండలన్ని పూలజల్లులై
ముద్దుకే పొద్దు పొడిచి
మిన్నేటి సూరీడు వచ్చేనమ్మా
పల్లె కోనెటి తామర్లు విచ్చేనమ్మా

0 Comments