Aidhurojula Pelli Song Lyrics Varudu Movie (2010)


Aidhurojula Pelli Song Lyrics Varudu Movie (2010)

Movie    :  Varudu
Lyrics    :  Veturi
Music    :  Manisharma
Singers  :  Ranjith, Sunandha, Malavika, Hemachandra, Jamuna Rani
Cast     :  Allu Arjun, Bhanusri Mehra


ఐదురోజుల పెళ్లి అమ్మంటి పెళ్లీ తొలిచూపులే లేని తెలుగింటి పెళ్లీ
వరుడు కోరిన పెళ్లి రామయ్య పెళ్లీ వధువు ఎవరో కాదు సీతమ్మ తల్లీ
ఆకాశ పందిళ్లు భూలోక సందడ్లు శ్రీరస్తు పెళ్లిళ్లు శుభమస్తు నూరేళ్లు

తుమ్మెదలాడె గుమ్మల జడలు హంసలు ఊడే అమ్మల నడలు
నగలకు కందే మగువల మెడలు పడుచు కళ్లకె గుండెల దడలు
ఆరాళ్లమ్మ కోవెల ముందు పసుపులాటతొ ధ్వజారోహనం
కళ్యణానికి అంకురార్పణం పడతులు కట్టె పచ్చతోరణం

ఇందరింతుల చేయి సుండరుడీ హాయి
తలకు పోసె చేయి తలపులొక్క వేయి
నలుగు పెట్టిన కొద్దీ అలిగింది వయసు
వయసు అలిగిన కొద్దీ వెలిగింది మనసు

మగపెళ్లి వారట ఈమని వారట పెళ్లికి తరలి వస్తున్నారట
కాఫీలు అడగరట ఉప్మాలు ఎరగరట వీరికి సద్దన్నమే ఘనమౌ
వీరి గోప్పలు చెప్ప తరమా
బాండ్ మేళాం అడగరట డోలు సన్నాయి ఎరగరట వీరికి భోగ మేళాం ఘనమౌ
వీరి గోప్పలు చెప్ప తరమా
మగపెళ్లి వారట ఈమని వారట పెళ్లి కి తరలి వస్తున్నారట

ఇమ్మని కట్నం కోరి మేం అడగేంలేదు ఇప్పటికైన ఎఫ్ ఎ బి ఎ చెప్పించండి
చెన్నపట్నం స్టాండ్ అద్దం కావాల్మాకు దానికి తగిన పందిరి మంచం ఇప్పించండి
కానుపూరు కండ్ల జోడు కావాల్మాకు దానికి తగిన వ్రిస్టు వాచ్ ఇప్పించండి
ఇమ్మని కట్నం కోరి మేం అడగేంలేదు ఇప్పటికైన ఎఫ్ ఎ బి ఎ చెప్పించండి

నచ్చె నచ్చె అచ్చ గర్ల్ ఫ్రెండ్ ఎక్కడ
యె ఎక్కడ

అది లబొ దిబొ గబ్బొ జబ్బొ మారేజి లవ్ మారేజి
అది హనీ మూన్ అవ్వoగానె డామేజీ
ఎవరికి వారె యమునా తీరె పాకేజి తోక పీకేజి
అది అటొ ఇటొ అయ్యిందంటె దారెదీ కృష్ణ బారేజ్

ఆకాశ పందిళ్లు భూలోక సందళ్లు శ్రీరస్తు పెళ్లిళ్లు సుభమస్తు నూరేళ్లు
ఐదురోజుల పెళ్లి అమ్మంటి పెళ్లీ తొలిచూపులే లేని తెలుగింటి పెళ్లీ
వరుడు కోరిన పెళ్లి రామయ్య పెళ్లీ వధువు ఎవరో కాదు సీతమ్మ తల్లీ

చేదు కాదోయి తమలాకు ముక్క అందులొ వెయ్యి సిరిపోగ సెక్క
సున్నమేసావొ నీ నోరు పొక్క ఫక్కు మంటాది మా ఇంటి సుక్క
పచ్చ కర్పూర తాంబూలమిచ్చాక ఎక్క వచ్చోయి కోమల్లె పక్క
పంచుకొవచ్చు మా పాల సుక్క పండుకోవచ్చు సై అంటె సుక్క
తెల్లవారాక నీ బుగ్గ సుక్క గుమ్మ కెరకాల గురుతైన లక్క
కరిగినా పొద్దు ఈ బంధమల్లొడొ నిండు నూరేల్లదీ జంట అక్క
నిన్ను దీవించిన ఆడ బిడ్డ ఊరు దివిసీమలో నందిగెడ్డ
ఆడ పంతుళ్ల అక్షింతలడ్డ మంచి శకునాల మీ ఇంట సెడ్డ
మమ్ము కనిపెట్టు మా రాస బిడ్డ

తట్టలొ కూర్చుండ బెట్టిన వధువునా గుమ్మడి పువ్వులొ కులికెనొకటీ..
అది మంచు ముత్యమా మన వధువు రత్నమా

Reactions

Post a Comment

0 Comments