Mahanati Song Lyrics Mahanati Movie (2018)


Movie:  Mahanaati
Lyrics:  Ramajogayya Sastry
Music:  Mickey J  Meyer
Singer:  Anurag Kulkarni
Cast      :  Keerthy Suresh, Dulquer Salaman


అభినేత్రి ఓ అభినేత్రి
అభినయనేత్రి నట గాయత్రి
మనసారా నిను కీర్తించి
పులకించినది ఈ జనదాత్రి
నిండుగా ఉందిలే దుర్గ ధీవెనం
ఉందిలే జన్మకో దైవ కారణం
నువ్వుగా వెలిగే ప్రతిబా గుణం
ఆ నటరాజుకు స్త్రీ రూపం
కళకే అంకితం నీ కన కణం
వెండి తెరకెన్నడో ఉందిలే రుణం
పేరుతో పాటుగా అమ్మనే పదం
నీకే దొరికిన సౌభాగ్యం

మహానటి మహానటి
మహానటి మహానటి
మహానటి మహానటి
మహానటి మహానటి

కళను వలచావు కలను గెలిచావు
కడలికెదురీది కథగ నిలిచావు
భాష ఏదైనా ఎదిగి ఒదిగావు
చరితపుటలోన వెలుగు పొదిగావు
పెను శిఖరాగ్రమై గగనాలపై నిలిపావుగా అడుగు
నీ ముఖచిత్రమై నలుచరగుల తలయెత్తినది మన తెలుగు

మహానటి మహానటి
మహానటి మహానటి
మహానటి మహానటి
మహానటి మహానటి

మనసు వైశాల్యం పెంచుకున్నావు
పరుల కన్నీరు పంచుకున్నావు
అసలు ధనమేదో తెలుసుకున్నావు
తుధకు మిగిలేది అందుకున్నావు
పరమార్థానికి అసలర్థమే నువు నడిచిన ఈ మార్గం
కనుకే గా మరి నీదైనది నువుగా అడగని వైభోగం

మహానటి మహానటి
మహానటి మహానటి
మహానటి మహానటి
మహానటి మహానటి


Reactions

Post a Comment

0 Comments