Maagha Maasavela Song Lyrics Ela Cheppanu Movie (2003)



Maagha Maasavela Song Lyrics Ela Cheppanu Movie (2003)

Movie:  Ela Cheppanu
Lyrics:  Sirivennela
Music:  Koti
Singers:  Udit Narayana, Shreya Ghoshal
Cast     :  Tharun, Shreya Saran


కళలు చిలుకు అలివేణి నుదుట కస్తూరి తిలకమును దిద్దరే
సిగ్గులొలుకు చెలి పసిడి బుగ్గలకు పసుపుతో నిగ్గు పెంచరే
కొత్త వెలుగు చూపించగలుగు పారాణి పూసి నడిపించరే
కన్నె గోదారి వధువుగా మారి కడలి కౌగిలికి చేరు తరుణమిది
వేడుకైన కళ్యాణ సమయమిది

మాఘమాస వేళ కోకిలమ్మ పాట
ప్రేమ పర్ణశాల చూపుతున్న బాట
అనురాగం తోడురాగా నవలోకం ఏలుకోగా
శుభలగ్నం చేరుకుందని పిలిచేలా
ఓ ఓ ఓ... ఓ ఓ ఓ...
ఓ ఓ ఓ... ఓ ఓ ఓ...
మాఘమాస వేళ కోకిలమ్మ పాట

తందాన తందాన తానాన తానానా
తందాన తందాన తననన నా...

ఎవరిని నే చూసినా అడుగులు ఎటు వేసినా
ఎదురయేది నువ్వే నీకు తెలుసునా..
నిను కలవని రోజున గడవదు ఏం చేసినా
వదలనంది నన్నే తీపి యాతన
నువ్వు వెతికే మజిలీ అవనా.....
నెచ్చెలిగా మదిలో చేరనా.....
ఇక అటు ఇటు ఎగరకే పావురమా
నా కౌగిలి కొలువున స్థిరపడుమా
తలపును దోచిన దొరతనమా
నా అనుమతి తమకిక అవసరమా
నన్ను నీలో నిన్ను నాలో నింపే నీ ప్రేమ
మాఘమాస వేళ కోకిలమ్మ పాట

మనసుకి మలి జన్మగా.. నువు మలిచిన బొమ్మగా..
నిన్ను అల్లుకోనీ.. కొత్త ఊపిరి..
హో గగనము దిగి నేరుగా ప్రియసఖిలా చేరగా..
నన్ను కలుసుకుందా నింగి జాబిలి
నా మనవిని విననే వినవా.....
ఇది నిజమని అననే ఆనవా.....
నది నడకలు నేర్పిన సాగరమా
నీ ఒడిలో ఒదిగితే చాలు సుమా
తెలియని సైగల స్వాగతమా
ఈ బిడియము దేనికే సోయగమా
ఆగనీదు సాగనీదు చూడు ఈ ప్రేమ
మాఘమాస వేళ కోకిలమ్మ పాట
అనురాగం తోడు రాగా నవలోకం ఏలుకోగా
శుభలగ్నం చేరుకుందని పిలిచేలా
ఓ ఓ ఓ... ఓ ఓ ఓ...
ఓ ఓ ఓ... ఓ ఓ ఓ...
Reactions

Post a Comment

0 Comments