Lokama Song Lyrics Kaadhali Movie (2017)



Lokama Song Lyrics Kaadhali Movie (2017)

Movie:  Kaadhali
Lyrics:  Vanamali
Music: Prasnan Praveen Shyam
Singers:  Naresh Iyer, Sowmya Sharma
Cast     :  Harish Kalyan, Sai Ronak, Pooja K Doshi


లోకమా నా కోసమా
ఇన్నేసి అందాలన్ని నాకే సొంతమా...
కాలమా... చాల్చాల్లమ్మా
నువ్వున్న చోటె ఇంక ఆగిపోవమ్మ...
నాతొ ఇన్నాల్లున్న స్వప్నమా
ఇంతందం నువ్వు చూపలేదమ్మా
మునుపింత హాయి ఏదమ్మా...
లోకమా నా కోసమా
ఇన్నేసి అందాలన్ని నాకే సొంతమా...
కాలమాచాల్చాల్లమ్మా
నువ్వున్న చోటె ఇంక ఆగిపోవమ్మ...
నాతొ ఇన్నాల్లున్న స్వప్నమా
ఇంతందం నువ్వు చూపలేదమ్మా
మునుపింత హాయి ఏదమ్మా...

స్నేహం లేదా ఊపిరితొ గాలికి
వీలవుతుందా ఎడబాటె రెంటికి
రెప్పైనా దేనికి చూపంటు లేని కంటికి
తనతోడె దొరుకున
కనుమూసె ధాక గుండెకి
నన్నిలా ఎగరేసినా రెక్కల్నె తుంచేస్తూ
ఇంతలొ చేజారున నా చెయ్యే వొదిలేస్తూ
గమ్యం లేనె దారె నాకె చూపుతూ...
లోకమా నా కోసమా
ఇన్నేసి అందాలన్ని నాకే సొంతమా...
కాలమా... చాల్చాలమ్మా
నువ్వున్న చోటె ఇంక ఆగిపోవమ్మ...
ఊ ఊ ఊ ఊ ఊ ఊ ఊ.....

కన్ను కల జత గానె సాగినా
కన్నీరేమొ నీడల్లె మారినా
ప్రతి ప్రశ్న ఈ క్షణం
నువ్వు నాకేమవ్తావన్నది
వెతికాన లోపల
నువ్వేగా కనిపిస్తున్నది
వున్నది ఒకరేనని చెప్పేద్దాం అనుకుంటె
లేనిది బదులేనని నీ మౌనం  అంటుందే
నీతొ ఉన్న నీలోనె నువ్ లేనా...
లోకమా నా కోసమా
ఇన్నేసి అందాలన్ని నాకే సొంతమా...
కాలమా... చాల్చాల్లమ్మా
నువ్వున్న చోటె ఇంక ఆగిపోవమ్మ...
నాతొ ఇన్నాల్లున్న స్వప్నమా
ఇంతందం నువ్వు చూపలేదమ్మా
మునుపింత హాయి ఏదమ్మా...
Reactions

Post a Comment

0 Comments