Bombhaat Song Lyrics LIE Movie (2017)
Movie: Lie
Lyrics: Kasarala Shyam
Music: Manisharma
Singers: Rahul Sipligunj, Ramya Behara
Cast: Nithin, Megha Akash
అదర నా గుండెలదర నిదుర కంటికి రా...దూ...
మదుర వెన్నెల గాసెను కదరా..
ఈ సిన్నదొస్తె పగలు వెన్నెల గాసెను గదరా...
బొమ్మోలె ఉన్నదిర పోరి
బం బంబాటు గుందిర నారి
లడ్డోలె ఉన్నదిర గోరి
లై లైలప్ప బుగ్గల్ది ప్యారి
బొమ్మోలె ఉన్నదిర పోరి
బం బంబాటు గుందిర నారి
లడ్డోలె ఉన్నదిర గోరి
లై లైలప్ప బుగ్గల్ది ప్యారి
ఏడికెల్లి ఊడిబడ్డదీ మిస్సు
దీని నవ్వుతోనె ఎలిగిపోయె యుఎస్సు
నడుమును జూత్తే అరెరెరె….
నడుమును జూత్తె నయగర ఫాల్స్
నేను బోత పయలెల్లిపోత
ఒక్కసారి ముట్టుకోని సచ్చిపోత
సచ్చిపోత
నేను బోత పయలెల్లిపోత
బాంచన్ నీ కాల్లు మొక్కి సచ్చిపోత
సచ్చిపోత
ట్రంపెట్ అల్లె ఒంపులున్న పోరి
ట్రంప్ లెక్క సంపుతుందిరొ నారి
ర్యాంపు వాక్ చెసుకుంటు గోరి
స్టాంపు గుద్దినాది గుండె మీద ప్యారి
అందగత్తె ఎవ్వరంటె వయ్యారి పిల్ల
నీ ఒక్కపేరె కనపడ్డదె గూగుల్లా
నువ్వు ఆగి ఒల్లు ఇరుసుకుంటె వయ్యారి పిల్ల
నాకు బొక్కలిరిగినట్టుందె రెండు పక్కల
నువ్వు లిప్పునట్ల గొరుకుతుంటె వయ్యారి పిల్ల
నిప్పు ఎల్ట పుట్టె తెలిసినాది నాకియ్యాల
నీ తోవకడ్డమొస్త నేను వయ్యారి పిల్ల
నన్ను పండబెట్టి తొక్కిపోవె చౌరస్తాల
సుక్కలెక్క సక్కగుంది పోరి
దీని సెమట సుక్క సెంటు నాకు వారి
అర్రె..
నన్ను గాని ఒప్పుకుంటె గోరి
నా స్కిన్ను ఒలిచి గుట్టిస్త సారీ
బొమ్మోలె ఉన్నదిర పోరి
బం బంబాటు గుందిర నారి
నీ కొంటె సూపు తాకితెనె వయ్యారి పిల్ల
మునిగి తేలినట్టు ఉంటదె కాసి గంగల
నీ ఒంటి గాలి సోకితేనె వయ్యారి పిల్ల
సచ్చిపోయి నేను పుడతనె మల్లా మల్లా
గ్రీన్ సిగ్నల్ ఇయ్యరాదె వయ్యారి పిల్ల
గ్రీన్ కార్డు తెచ్చుకుంటనె తెల్లారికల్ల
ఓ మంచిరోజు చూసి రావె వయ్యారి పిల్ల
ఫ్రెంచ్ వైన్ లెక్క దాచుకుంటనే గుండెల్ల
వైటు హౌసు వన్నెలున్న పోరి
లైట్ హౌసు లెక్క సూపరాదె దారి
అరెరెరె…
రైట్ హాండ్ పట్టుకుంటె గోరి
నీకు డిస్ని లాండు రాసిస్త ప్యారి
బొమ్మోలె ఉన్నదిర పోరి
బం బంబాటు గుందిర నారి

0 Comments