Aalochana Vasthene Song Lyrics Oh My Friend Movie (2011)



Aalochana Vasthene Song Lyrics Oh My Friend Movie (2011)

Movie:  Oh My Friend
Lyrics:  Sirivennela
Music:  Rahul Raj
Singers:  Ranjith Govind, Sangeetha Prabhu, Sarah Straub
Cast     :  Siddharth, Hansika, Shruti Hasan  



ఆలోచన వస్తేనే అమ్మో అనిపిస్తోందే
నువ్వంటూ నా కనపడకుంటే ఏమయ్యేదో
నిన్నటి దాకా నేనే...నువ్వు నా పక్కన లేందే...
ఉన్నానంటే నమ్మాలో లేదో
ఏనాడు ఇలా ఈ మాటా నీతో అనగలనో లేదో
హో అంటున్నది నీ మౌనం...వింటున్నది నా ప్రాణం
ఇద్దరికి తెలిసిన సత్యం వేరే కోరదు ఏ సాక్ష్యం
ఒంటరిగా ఒక్క క్షణం నిన్నొదలను ఏ మాత్రం
అందుకనేగానే ముందే పుట్టి ఉన్నా నీ కోసం

ప్రాయం ఉన్నా పయనం ఉన్నా పాదం మాత్రం ఎటో పడదు
దారి నేనే దరిని నేనే నడిపిస్తాగా.. ప్రతి అడుగు
బెదురుగా.. హా తడబడే మనసిది..
కుదురుగా.. హా నిలపవా జతపడి
హో అంటున్నది నీ మౌనం...వింటున్నది నా ప్రాణం..
ఇద్దరికి తెలిసిన సత్యం వేరే కోరదు ఏ సాక్ష్యం
హే ఒంటరిగా ఒక్క క్షణం నిన్నొదలను ఏ మాత్రం
అందుకనేగానే ముందే పుట్టి ఉన్నా నీ కోసం

నీ కన్నులతో.. చూసేదాక స్వప్నాలంటే తెలియదెప్పుడు
నా కల ఎదో.. గుర్తించాగా నీ రూపంలో ఇలా ఇపుడు..
చలనమే.... హా కలగని చెలియలో...
హా సమయమే.... హా కరగని చెలిమిలో....
ఆలోచన వస్తేనే అమ్మో అనిపిస్తోందే
నువ్వంటూ నా కనపడకుంటే ఏమయ్యేదో
నిన్నటి దాకా నేనే..నువ్వు నా పక్కన లేందే...
ఉన్నానంటే నమ్మాలో లేదో
ఏనాడైన ఇలా ఈ మాటా నీతో అనగలనో లేదో
హో అంటున్నది నీ మౌనం..వింటున్నది నా ప్రాణం
ఇద్దరికి తెలిసిన సత్యం వేరే కోరదు ఏ సాక్ష్యం
ఒంటరిగా ఒక్క క్షణం నిన్నొదలను ఏ మాత్రం
అందుకనేగానే ముందే పుట్టి ఉన్నా నీ కోసం
Reactions

Post a Comment

0 Comments