Yemaindhi Ee Vela Song Lyrics Aadavari Matalaku Ardhale Verule Movie (2007)
Movie : Aadavari Matalaku Ardhale Verule
Lyrics : Kulasekhar
Music : Yuvan Shankar Raja
Singer: Udit Narayana
Can you feel her?
Is your heart speaking to her?
Can you feel the love?
Yes
ఏమైంది ఈ వేళ
ఎదలో ఈ సందడేలా
మిల మిల మిల మేఘమాలా
చిటపట చినుకేయు వేళ
చెలి కులుకులు చూడగానే చిరు
చెమటలు పోయనేల..
ఏ శిల్పి చెక్కెనీ శిల్పం
సరికొత్తగా వుంది రూపం
కనురెప్ప వేయనీదు ఆ అందం
మనసులోన వింత మొహం
మరువలేని ఇంద్ర జాలం
వానలోన ఇంత దాహం
చినుకులలో వాన విల్లు నేలకిలా జారెనే
తళుకుమనే ఆమె ముందు వెల వెల వెల బోయెనే
తన సొగసు తీగలాగా నా మనసే లాగెనే
అది మొదలు ఆమె వైపే నా అడుగులు సాగెనే
నిశీధిలో ఉషోదయం ఇవాళిలా ఎదురే వస్తే
చిలిపి కనులు తాళమేసే
చినుకు తడికి చిందులేసే
మనసు మురిసి పాటపాడే
తనువు మరిచి ఆటలాడే
ఏమైంది ఈ వేళ
ఎదలో ఈ సందడేలా
మిల మిల మిల మేఘమాలా
చిటపట చినుకేయు వేళ
చెలి కులుకులు చూడగానే చిరు
చెమటలు పోయనేల..
ఆమె అందమే చూస్తే
మరి లేదు లేదు నిదురింక
ఆమె నన్నిలా చూస్తే ఎద మోయలేదు ఆ పులకింత
తన చిలిపి నవ్వుతోనే పెను మాయ చేసెనా
తన నడుము వొంపులోనే నెలవంక పూచెనా
కనుల ఎదుటే కలగా నిలిచా
కలలు నిజమై జగము మరిచా
మొదటి సారి మెరుపు చూసా
కడలిలాగే ఉరకలేసా
0 Comments