Yem Cheddaam Song Lyrics Seethamma Vakitlo Sirimalle Chettu Movie (2012)
Movie: SVSC
Lyrics: Sirivennela
Music: Mickey J Meyer
Singers: Ranjith, Karthik, Sreeram Chandra
ఆకాశం విరిగినట్టు కాకూడనిదేదో జరిగినట్టు
కిం కర్తవ్యం అని కలవరపడడం కొందరి తరహా
అవకాశం చూసుకుంటూ ఆటంకాలొడుపుగ దాటుకుంటూ
వాటంగా దూసుకుపొతే మేలని కొందరి సలహా
ఏదో తలవడం వేరే జరగడం సర్లే అనడమే వేదాంతం
దేన్నొ వెతకడం ఎన్నో అడగటం ఎపుడూ తెమలని రాద్ధాంతం
ఏం చేద్దాం అనుకుంటె మాత్రం ఏం పొడిచేస్తాం
ఏం చూద్దాం మునుముందేముందో తెలియని చిత్రం
ఏమౌతాం మననెవరడిగారని ఏమని అంటాం
ఏం విందాం తర తరికిట తక తక ధూం ధూం తక ధూం
ఆకాశం విరిగినట్టు కాకూడనిదేదో జరిగినట్టు
కిం కర్తవ్యం అని కలవరపడడం కొందరి తరహా
అవకాశం చూసుకుంటూ ఆటంకాలొడుపుగ దాటుకుంటూ
వాటంగా దూసుకుపొతే మేలని కొందరి సలహా
ఫాలో పదుగురి బాటా బోలో నలుగురి మాటా
లోలో కలవరపాటా దాంతో గడవదు పూటా
ఇటా అటా అని ప్రతొక్క దారిని నిలేసి అడగకు సహోదరా
ఇదే ఇదే అని ప్రమాణ పూర్తిగ తెగేసి చెప్పేదెలాగరా
ఇది గ్రహించినారీ మహాజనం ప్రయాశ పడి ఏం ప్రయోజనం
సిమెంట్ భూతల సహార దారిది నిలవడం కుదరదే కదలరా
ఏం చేద్దాం అనుకుంటె మాత్రం ఏం పొడిచేస్తాం
ఏం చూద్దాం మునుముందేముందో తెలియని చిత్రం
ఏమౌతాం మననెవరడిగారని ఏమని అంటాం
ఏం విందాం తర తరికిట తక తక ధూం ధూం తక ధూం
ఎన్నో పనులను చేస్తాం..ఏవో పరుగులు తీస్తాం
సతమతమవుతాం
ఓహో బతుకిదే అంటాం
అడంగు తెలియని ప్రయాణమే యుగ యుగాలుగ మన అయోమయం
వెనక్కు తిరగని ప్రవాహమే యేతుఫాను తరిమిన ప్రతీక్షణం
ఇది పుటుక్కు జర జర డుబుక్కు మే అడక్కు అది ఒక రహస్యమే
ఫలాన బదులని తెలీని ప్రశ్నలు అడగటం అలగడం తగదు గా

0 Comments