Ye Dikkuna Nuvvunna Song Lyrics Yuvasena Movie (2004)
Movie: Yuvasena
Lyrics: Ramajogayya Sastry
Music: Jessie Gift
Singer: Jessie Gift
ఏ దిక్కున నువ్వున్నా ఎగిరొస్తా పావురవూ
నా రెక్కల కలనాపే బలమేది లేదు సుమా
పొంగే అలవొస్తే తలవంచాలి
వయుసూ అలలాంటిదేగా
ప్రాయం వెనకాలే పయనించాలి
ప్రణయం వెన్నాడిరాగా
ఏ దిక్కున నువ్వున్నా ఎగిరొస్తా పావురవూ
నా రెక్కల కలనాపే బలమేది లేదు సుమా
గిరులే ఒణికే జలపాతంలో జోరు
నీలో చూశా బంగారూ
ఎదిగే సొగసై ఎదురొస్తే పదహారు
అలలై ఎగిసే ఎదహోరు
వర్ణాల విల్లులో ఒక్కోరంగు తీసి
వయ్యారి ఒంటికి పూసిందెవరు
మనసే చెడక నిలిచే నరవరులెవరు..
వుధువే తొణికే అధరం వుధుకలశం
మౌనం కూడా ప్రియ మంత్రం
అపుడూ అపుడూ తెగిపడనీ ఒక ముత్యం
వెనకే తిరిగా ప్రతినిత్యం
ఆ చిలక పలుకులే అలా అలా ఏరి
నాలోని తలపులే స్వరాలు చేసి
నీకే ఇస్తా సఖియ కవితలు కూర్చి...
ఏ దిక్కున నువ్వున్నా ఎగిరొస్తా పావురవూ
నా రెక్కల కలనాపే బలమేది లేదు సుమా
పొంగే అలవొస్తే తలవంచాలి
వయుసూ అలలాంటిదేగా
ప్రాయం వెనకాలే పయనించాలి
ప్రణయం వెన్నాడిరాగా
ఏ దిక్కున నువ్వున్నా ఎగిరొస్తా పావురవూ
నా రెక్కల కలనాపే బలమేది లేదు సుమా

0 Comments