Uyyalaina Jampalaina Song Lyrics Uyyala Jampala Movie (2013)
Movie: Uyyala Jampal
Lyrics: Vasu Valaboju
Music: Sunny MR
Singers: Anudeep Dev, Harshika Gudi
ఉయ్యాలైనా జంపాలైనా నీతో ఊగమనీ..
మళ్లీ మనలా పుట్టించాడు సీతారాములనీ..
ఇదోరకం స్వయంవరం అనేట్టుగా ఇలా..
నీ చూపులే నాపై పడే ఓ పూలమాలలా..
హరివిల్లు దారాల బంగారు ఉయ్యాల వెన్నెల్లొ ఊగాలిలా..
ఓహో..నీవేగ నాలో నా గుండెలో శ్రుతీ లయ..
ఓహో..నీవేగ నాకు నా ఊహలో సఖీ ప్రియా..
చెయ్యే చాస్తే అందేటంతా దగ్గర్లో ఉంది..
చందమామ నీలామారి నా పక్కనుంది..
నీకోసం నాకోసం ఇవ్వాళే ఇలా..
గుమ్మంలో కొచ్చింది ఉగాదే కదా..
ఒక్కోక్షణం పోతేపోనీ పోయేదేముంది..
కాలాన్నిలా ఆపే బలం ఇద్దర్లో ఉంది..
రేపంటూ మాపంటూ లేనేలేని లోకంలో ఇద్దరినే ఊహించని..
ఎటువైపు చూస్తున్న నీరూపు కనిపించి చిరునవ్వు నవ్వే ఎలా..
ఎదురైతే రాలేను ఎటువైపు పోలేను నీ పక్కకొచ్చేదెలా..
ఓహో..నా జానకల్లే ఉండాలిగా నువ్వే ఇలా..
ఓహో..వనవాసమైన నీ జంటలో సుఖం కదా ..
ఉయ్యాలైనా జంపాలైనా నీతో ఊగమనీ..
మళ్లీ మనలా పుట్టించాడు సీతారాములనీ..
నా పాదమే పదే పదే నీ వైపుకే పడే..
జోలాలి పాట ఈడునే పడింది ఈ ముడే..
ఓహో..ఎన్నాళ్లగానో నా కళ్లలో కనే కల..
ఓహో..ఈ ఇంద్రజాలం నీదేనయా మహాశయా..
గుండెకే చిల్లే పడేలా జింకలా నువ్వే గెంతాలా..
ఇద్దరం చెరో సగం సగం సగం సగం..
ఎందుకో ఏమో ఈవేళా నేనే సొంతం అయ్యేలా..
నువ్వు నా చెంతేచేరి చేయి నిజం కొంచెం..

0 Comments