Prema Endukani Song Lyrics Ninne Premistha Movie (2000)
Movie: Ninne Premistha
Lyrics: E S Murthy
Music: S A Rajkumar
Singers: Rajesh, Chitra
ప్రేమా ఎందుకని నేనంటే అంత ప్రేమ నీకు
కమ్మని కలలన్ని నిజమయ్యే కానుకిచ్చినావు
ఇనాళ్ళకు దొరికింది ఓ చెలి స్నేహం
ఇపుడే అది కానుంది తీయని బంధం
శుభలేఖలు పంపే మంచి ముహూర్తం పరుగున వస్తుంది
ప్రేమా ఎందుకని నేనంటే అంత ప్రేమ నీకు
కమ్మని కలలన్ని నిజమయ్యే కానుకిచ్చినావు
పాటలా వినిపించే ఆమె ప్రతి పలుకు
హంసలా కదిలొచ్చే అందాల ఆ కులుకు
వెన్నెలే అలిగేలా అతని చిరునవ్వు
చీకటి చెరిగేలా ఆ కంటి చూపు
వేకువ జామున వాకిట వెలిసే వన్నెల వాసంతం
ముగ్గుల నడుమన సిగ్గులు జల్లే నా చెలి మందారం
ఎంత చేరువై వుంటే అంత సంబరం
ప్రేమా ఎందుకని నేనంటే అంత ప్రేమ నీకు
కమ్మని కలలన్ని నిజమయ్యే కానుకిచ్చినావు
ఏటిలో తరగల్లే ఆగనంటుంది
ఎదురుగా నేనుంటే మూగబోతోంది
కంటికి కునుకంటూ రాను పొమ్మంది
మనసుతో ఆ చూపే ఆడుకుంటోంది
ఏ మాసంలో వస్తుందో జత కలిపే శుభసమయం
అందాకా మరి ఆగాలంటే వింటుందా హృదయం
వేచివున్న ప్రతి నిముషం వింత అనుభవం
ప్రేమా ఎందుకని నేనంటే అంత ప్రేమ నీకు
కమ్మని కలలన్ని నిజమయ్యే కానుకిచ్చినావు
ఇనాళ్ళకు దొరికింది ఓ చెలి స్నేహం
ఇపుడే అది కానుంది తీయని బంధం
శుభలేఖలు పంపే మంచి ముహూర్తం పరుగున వస్తుంది
ప్రేమా ఎందుకని నేనంటే అంత ప్రేమ నీకు
కమ్మని కలలన్ని నిజమయ్యే కానుకిచ్చినావు

0 Comments