Prasnante Song Lyrics Karthikeya Movie (2014)

Prasnante Song Lyrics Karthikeya Movie (2014)

Movie:  Karthikeya
Lyrics:  Ramajogayya Sastry 
Music:  Sekhar Chandra
Singer:  Ranjith

ప్రశ్నంటే నింగినే నిలదీసే అల
ప్రశ్నించే లక్షణం లేకుంటే ఎలా
బదులంటే ఎక్కడో ఏ చోటో లేదురా
శోధించే చూపులో ఓ నలుపై గెలుపై దాగుందంట
ప్రతి ఒక రోజిలా ఒకటే మూసగా... బ్రతుకును లాగటం బరువేగా మనసుకి
సరికొత్త క్షణాలకై వెతికే దారిగా... అడుగులు కదుపుతూ పయనిద్దాం ప్రగతికీ
ప్రశ్నంటే.... ప్రశ్నంటే నింగినే నిలదీసే అల
ప్రశ్నించే లక్షణం లేకుంటే ఎలా

పలు రంగులు దాగి లేవా పైక్కనిపించే తెలుపులోన
చిమ్మ చీకటి ముసుగులోను నీడలు ఎన్నో ఉండవా
అడగనిదే ఏ జవాబు తనకై తానెదురుకాదు
అద్భుతమే దొరుకుతుంది అన్వేషించారా
ప్రతి ఒక రోజిలా ఒకటే మూసగా... బ్రతుకును లాగటం బరువేగా మనసుకి
సరికొత్త క్షణాలకై వెతికే దారిగా... అడుగులు కదుపుతూ పయనిద్దాం ప్రగతికీ
ప్రశ్నంటే నింగినే ... నిలదీసే అల
ప్రశ్నించే లక్షణం ... లేకుంటే ఎలా

ఎపుడో ఎన్నేళ్ళనాడో నాందిగా మొదలైన వేట
ఎదిగే ప్రతి మలుపుతోను మార్చలేదా మనిషి బాట
తెలియని తనమే పునాది... తెలిసిన క్షణమే ఉగాది
తెలివికి గిరిగీత ఏది... ప్రయత్నించరా
ప్రతి ఒక రోజిలా ఒకటే మూసగా... బ్రతుకును లాగటం బరువేగా మనసుకి
సరికొత్త క్షణాలకై వెతికే దారిగా... అడుగులు కదుపుతూ పయనిద్దాం ప్రగతికీ
ప్రశ్నంటే నింగినే నిలదీసే అల
ప్రశ్నించే లక్షణం లేకుంటే ఎలా
Reactions

Post a Comment

0 Comments