Patala Pallakivai Song Lyrics Nuvvu Vastavani Movie (2000)



Patala Pallakivai Song Lyrics Nuvvu Vastavani Movie (2000)

Movie    :  Nuvvu Vastavani
Lyrics    :  Sirivennela
Music    :  S A Rajkumar
Singer   :  SP Balu


పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి
కంటికి కనపడవేం నిన్నెక్కడవెతకాలి
నీతోడు లేనిదే శ్వాసకి శ్వాస ఆడదే
నువ్వే చేరుకోనిదే గుండెకి సందడుండదే
నీ కోసమే అన్వేషణ నీ రూపు రేఖలేవో ఎవరినడగాలి ||పాటల||

నీలాల కనుపాప లోకాన్ని చూస్తుంది
తనరూపు తానెపుడూ చూపించలేనంది
అద్దంలా మెరిసే ఒక హృదయం కావాలి
ఆ మదిలో వెలుగే తన రూపం చూపాలి
రెప్పల వెనక ప్రతి స్వప్నం కలలోకిస్తుంది
రెప్పలు తెరిచే మెలుకువలో కల నిదురిస్తుంది
ఆ కలక జాడ కళ్ళు ఎవరినడగాలి|| పాటల||

పాదాల్ని నడిపించేప్రాణాల రూపేది
ఊహల్ని కదిలించే భావాల ఉనికేది
వెన్నల దారమా జాబిల్లిని చేర్చుమా
కోయిల గానమా నీ గుటిని చూపుమా
ఏ నిముషంలో నీ రాగం నా మది తాకింది
తనలో నన్నే కరిగించి పయనిస్తూ ఉంది
ఆ రాగమెపుడు నాకు ఎదురుపడుతుంది || పాటల |

Reactions

Post a Comment

0 Comments