Pacchani Chilukalu Song Lyrics Bharateeyudu Movie (1996)

Movie:  Bharateeyudu
Lyrics:  Buhavana Chandra
Music:  A R Rehman
Singer:  K J Yesudas

తందానానే తానానే ఆనందమే
తందానానే తానానే ఆనందమే
తందానానే తానానే ఆనందమే
తందానానే తానానే ఆనందమే...
పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే
భూలోకమె ఆనందానికి ఇల్లు ఈ లోకంలో కన్నీరింక చెల్లు...

భూలోకమె ఆనందానికి ఇల్లు ఈ లోకంలో కన్నీరింక చెల్లు..
చిన్న చిన్న గూటిలోనె స్వర్గముందిలే
అరె చిన్ని చిన్ని గుండెల్లోన ప్రేమ ఇంకిపోదులే
సీతాకోకచిలుకకు చీరలెందుకు
అరె ప్రేమ ఉంటె చాలునంట డబ్బు గిబ్బు లెందుకంట..
పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే
భూలోకమె ఆనందానికి ఇల్లు ఈ లోకంలో కన్నీరింక చెల్లు...

అందని మిన్నే ఆనందం అందే మన్నే ఆనందం
అరె భూమిని చీల్చుకు పుట్టే పచ్చని పసిరిక ఆనందం
మంచుకి ఎండే ఆనందం వాగుకి వానే ఆనందం
అరె ఎండకి వానకి రంగులు మారే ప్రకృతి ఆనందం
బ్రతుకే నూరేళ్ళందం బ్రతుకే బ్రహ్మానందం
చెలియ వయసుడిగే స్వగతంలో అనుబందం అనందమానందం
పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే
భూలోకమె ఆనందానికి ఇల్లు ఈ లోకంలో కన్నీరింక చెల్లు...

నీ శ్వాసను నేనైతే నా వయసే ఆనందం
మరు జన్మకు నన్నే కన్నావంటే ఇంకా ఆనందం
చలి గుప్పే మాసంలో చెలి వొళ్ళే ఆనందం
నా చెవులను మూస్తూ దుప్పటి కప్పే కరుణే ఆనందం
అందం ఓ ఆనందం బంధం పరమానందం
చెలియా ఇతరులకై కను జారే కన్నీరే అనందమానందం
పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే
భూలోకమె ఆనందానికి ఇల్లు ఈ లోకంలో కన్నీరింక చెల్లు...
పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే
భూలోకమె ఆనందానికి ఇల్లు ఈ లోకంలో కన్నీరింక చెల్లు
చిన్న చిన్న గూటిలోనె స్వర్గముందిలే
అరె చిన్ని చిన్ని గుండెల్లోన ప్రేమ ఇంకిపోదులే
సీతాకోకచిలుకకు చీరలెందుకు
అరె ప్రేమ ఉంటె చాలునంట డబ్బు గిబ్బు లెందుకంట
పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే
భూలోకమె ఆనందానికి ఇల్లు ఈ లోకంలో కన్నీరింక చెల్లు...

Reactions

Post a Comment

0 Comments