Paccha Bottesina Song Lyrics Bahubali Movie (2015)



Paccha Bottesina Song Lyrics Bahubali Movie (2015)

Movie:  Bahubali
Lyrics:  Anantha Sriram
Music:  Keeravani
Singers  :  Karthik, Damini

పచ్చ బొట్టేసిన పిల్లగాడా నీతో
పచ్చి ప్రాయాలనే పంచుకుంటానురా
జంటకట్టేసిన తుంటరోడ నీతో
కొంటె తంటాలనే తెచ్చుకుంటా దొరా
వేయి జన్మాల ఆరాటమై
వేచి ఉన్నానే నీ ముందర
చేయి నీ చేతిలో చేరగా
రెక్క విప్పిందే నా తొందర...
పచ్చ బొట్టేసిన పిల్లగాడా నీతో
పచ్చి ప్రాయాలనే పంచుకుంటానురా...

మాయగా నీ సోయగాలాలు వేసి
నన్నిలా లాగింది నువ్వే హలా
కబురులతో కాలాన్ని కరిగించే వ్రతమేలా
హత్తుకుపో నను ఊపిరి ఆగేలా
బాహు బంధాల పొత్తిళ్లలో...విచ్చుకున్నావే ఓ మల్లిక...
కోడె కౌగిళ్ల ఒత్తిళ్లలో...పురి విప్పింది నా కోరిక...
పచ్చ బొట్టేసిన పిల్లగాడా నీతో
పచ్చి ప్రాయాలనే పంచుకుంటానురా...

కానలో నువు నేను ఒకమేను కాగా
కోనలో ప్రతి కొమ్మ మురి సేనుగా
మరుక్షణమే ఎదుర్తెనా మరణము కూడా పరవశమే
సాంతం నేనీ సొంతము అయ్యాకా
చెమ్మ చేరేటి చెక్కిళ్లలో...చిందులేసింది సిరివెన్నెల...
ప్రేమ ఉరేటి నీ కళ్లలో...రేయి కరిగింది తెలిమంచులా...
పచ్చ బొట్టేసిన పిల్లగాడా నీతో
పచ్చి ప్రాయాలనే పంచుకుంటానురా
జంటకట్టేసిన తుంటరోడ నీతో
కొంటె తంటాలనే తెచ్చుకుంటా దొరా
Reactions

Post a Comment

0 Comments