Osey Osey Song Lyrics Julayi Movie (2012)



Osey Osey Song Lyrics Julayi Movie (2012)

Movie:  Julayi
Lyrics:  Srimani
Music:  Devi Sri Prasad
Singer:  Jessie Gift
Cast     :  Allu Arjun, Ileana


ఓ లవ లవ లవ లవ లవ లవ
కోపగించుకోకే తేనె కళ్ల పాలకోవా
ఓ లవ లవ లవ లవ లవ లవ
మూతి ముడుచుకోకే మార్చి నెల్లో మల్లెపువ్వా
హేయ్ పోలిసోడి బండి సైరన్‌లా
అంబులెన్స్ గాడీ హారన్ల
లౌడ్ స్పీకర్ ఏదో మింగావనేంతగా ఏందీ గోల
ప్రేమ పుండు మీద కారం పెట్టి
గుండె అంచుకేమో దారం కట్టి
ఇష్టమొచ్చినట్లు దాన్నే ఎగరెయ్యకే అలా ఇలా
ఒసేయ్ ఒసేయ్ నన్ను ఉరేసి ఎల్లిపోకే
ఒసేయ్ ఒసేయ్ నన్ను పారేసి పారిపోకే
ఒసేయ్ ఒసేయ్ ఈడిని ఉరేసి ఎల్లిపోకే
ఒసేయ్ ఒసేయ్ ఈడిని పారేసి పారిపోకే

నువ్వెంటలేనిదే టెంపుల్‌కెళితే తిట్టి పంపడా గాడే
నువ్వు తోడు లేనిదే పబ్‌కి పోతే నో ఎంట్రీ బోర్డే
సింగిల్‌గా నన్ను ఆ మిర్రర్ చూస్తే ఎర్రర్ అంటూ తిడతాదే
నా సొంత నీడే నన్ను పోల్చుకోలేక తికమక పడతాదే
ఉప్పులేని పప్పుచారులా స్టెప్పులెయ్యని చిరంజీవిలా
నువ్వు లేకపోతే పిల్లా దిక్కే నాకు దక్కేదెలా
ఒసేయ్ ఒసేయ్ నన్ను ఉతికేసి ఆరేయకే
ఒసేయ్ ఒసేయ్ నన్ను పిండేసి పారేయకే
ఒసేయ్ ఒసేయ్ ఈడిని ఉతికేసి ఆరేయకే
ఒసేయ్ ఒసేయ్ ఈడిని పిండేసి పారేయకే
ఓ లవ లవ లవ లవ లవ లవ
కోపగించుకోకే తేనె కళ్ల పాలకోవా

నువు క్రికెట్ ఆడితే ఒక్కో టిక్కెటు లక్ష పెట్టి కొంటానే
నువ్వు అవుట్ అంటే ఆ అంపైర్ పైనే కక్షే కడతానే
నీ నవ్వు కోసమై క్యూలో ఉండే కోటిమందిని నేనే
నువు ఏడిపించినా నిను నవ్వించే ఏకైక జోకర్ నే
మందు ఉందే హార్ట్ ఫెయిల్‌కి
మందు ఉందే లవ్ ఫెయిల్‌కి
పండులా ఉన్నోడిని పేషెంట్‌లా మార్చేయకే
ఒసేయ్ ఒసేయ్ నన్ను చంపేసి పారబొయ్యకే
ఒసేయ్ ఒసేయ్ నన్ను చంపేసి పాతరేయకే
ఒసేయ్ ఒసేయ్ ఈడిని చంపేసి పారబొయ్యకే
ఒసేయ్ ఒసేయ్ ఈడిని చంపేసి పాతరేయకే

Reactions

Post a Comment

0 Comments