O Priyurala Song Lyrics Mounamelanoye Movie (2002)



O Priyurala Song Lyrics Mounamelanoye Movie (2002)

Movie:  Mounamelanoye
Lyrics:  Veturi
Music:  Ramana Gogula
Singers:  Ramana Gogula, Priya
Cast:  Sachin, Sampada


ఓ ప్రియురాలా నా మధుబాలా నిజాల కలా
నీ నయనాల ఆ గగనాల సితారకలా
మల్లె మాలికలే రచించే మౌన గీతికలా
సన్న జాజులలో సుమించే సందె కోరికలా
ఓ చెలికాడా ఈ చెలికాడా ఇదేం రగడా
నా నిను చూడ నీ జత కూడ ఇదేమి దడ
తేనె వెన్నెలతో లిఖించే ప్రేమ పత్రికలా
పిల్ల గాలులతో ధ్వనించే వేణు గీతికలా..
ఓ ప్రియురాలా నా మధుబాలా నిజాల కలా
నీ నయనాల ఆ గగనాల సితారకలా

నీ పెదవి దాటే పూల ఋతువేదో
మీటింది నాలో సుఖ వీణలే
నీ కనుల దాటే తీపి కల ఏదో
రాసింది నాకే శుభలేఖలే
ఓ ప్రియురాలా నా మధుబాలా నిజాల కలా
ఓ చెలికాడా ఈ చెలికాడా ఇదేం రగడా

నా కథలు రాసే నీ కవితలెన్నో
కరిగించే నాలో కనుపాపలే
నీ నడుము దాచే ఊయలలు ఎన్నో
పలికించే నాలో ప్రియ జోలలే
ఓ చెలికాడా ఈ చెలికాడా ఇదేం రగడా
నా నిను చూడ నీ జత కూడ ఇదేమి దడ
తేనె వెన్నెలతో లిఖించే ప్రేమ పత్రికలా
పిల్ల గాలులతో ధ్వనించే వేణు గీతికలా
ఓ ప్రియురాలా నా మధుబాలా నిజాల కలా
నీ నయనాల ఆ గగనాల సితారకలా

Reactions

Post a Comment

0 Comments