O Pilla Subhanalla Song Lyrics Sardar Gabbar Singh Movie (2016)



O Pilla Subhanalla Song Lyrics Sardar Gabbar Singh Movie (2016)

Movie:  Sardar Gabbar Singh
Lyrics:  Anantha Sriram
Music:  Devi Sri Prasad
Singers:  Vijay Prakash, Shreya Ghoshal


ఓ పిల్లా శుభానల్లా ..
వచ్చావే ఎండల్లో వెన్నెల్లా ..
నీ వల్లా హల్లా గుల్లా అయింది మనసు ఇవాళా ..
నా ఖాకీ చొక్కాని రంగుల్లో ముంచావే..
నా లంగా ఓణీకీ చీరల్లే సిగ్గందించావే..
ఓ పిల్లా శుభానల్లా..
వచ్చావే ఎండల్లో వెన్నెల్లా..
నీ వల్లా హల్లా గుల్లా అయింది మనసు ఇవాళా..

నీ కళ్ళల్లో మాయున్నది..
ఆ చూపుల్లో మందున్నది..
ఖైదీల అంతు చూసే నన్నే..
ఖైధీలా కూర్చో పెట్టాశావే..
నీ నవ్వుల్లో మహిమున్నది..
గిలిగింతలే పెడుతుందది..
మౌనాన్నే వాటేసే నాతోనే..
ఏదేదో మాటాడిస్తున్నాదే..
ఏ ఈత రానోడ్ని...గోదాట్లో తోసావే...
మళ్ళీ మబ్బుల్లో తేల్చావే ...
ఓ పిల్లా శుభానల్లా..
వచ్చావే ఎండల్లో వెన్నెల్లా..
నీ వల్లా హల్లా గుల్లా అయింది మనసు ఇవాళా..

మామూలుగా మొండోడినీ..
ఏ మూలనో మంచోడినీ..
హయ్యొయ్యో ఇప్పుడీరెండు కాక..
చంటోడినైపోయా నిను చూశాకా...
నేనెప్పుడు నా దానిని..
నాలా ఇలా నన్నుండనీ..
మార్చావా వచ్చేస్తా నీ దాకా ..
నన్నైనా నేను ఆపలేకా...
నే కాల్చే తూటాలూ...పువ్వుల్లా పుట్టాయే..
నీ మెల్లో దండేయ్ మన్నాయే...
ఓ పిల్లా శుభానల్లా..
వచ్చావే ఎండల్లో వెన్నెల్లా..
నీ వల్లా హల్లా గుల్లా అయింది మనసు ఇవాళా..

Reactions

Post a Comment

0 Comments