Ninnu Chudagane Song Lyrics Loukyam Movie(2014)



Ninnu Chudagane Song Lyrics Loukyam Movie(2014)

Movie:  Loukyam
Lyrics:  Anantha Sriram
Music:  Anup Rubens
Singers:  Vijay Prakash, Mohana


నానా నాన నాన నానానా నానానా
నానా నాన నాన నానానా నానానా
నననననన నననననననన
హో నిన్ను చూడగానే నాకేదో అయ్యిందే
ఉన్నట్టుండి ప్రాణం నీ వైపే లాగిందే
నిన్ను చూడగానె నాకేదో అయ్యిందే ఆహా..
ఉన్నట్టుండి ప్రాణం నీ వైపే లాగిందే ఆ..
ఎపుడైతే నువ్వలా కనిపించావో ఇలా
మొదలైంది ఈ గుండెలోన గోల
ఎదురుగా నువ్వేలే వెనకనా నువ్వేలే
పక్కన నువ్వేలే నా చుట్టూ నువ్వేలే
హో.. నిన్ను చూడగానె నాకేదో అయ్యిందే ఆహా..
ఉన్నట్టుండి ప్రాణం నీ వైపే లాగిందే ఆ..
నననననన నననననననన

ఓహ్ చూపులో సూదున్నాదే కళ్లలో మందున్నాదే
సూది మందేదో ఇచ్చావే
హో నవ్వుతోనే నువ్వు గాలాలు వేస్తే
చేపలాగా చిక్కినాదే మది
బాపురే నీ రంగు బంగారూ  కదే
గుర్తుకొస్తున్నాదె తెల్లార్లూ అదే..
ఎలా నీకు దూరంగా నేనుండనే..
ఎదురుగా నువ్వేలే వెనకనా నువ్వేలే
పక్కన నువ్వేలే నా చుట్టూ నువ్వేలే
హో.. నిన్ను చూడగానె నాకేదో అయ్యిందే
ఉన్నట్టుండి ప్రాణం నీ వైపే లాగిందే

హో హో హో.. ఎందరో ఎదురయ్యారే ఒక్కరూ నీలా లేరే
నిన్ను మించే అందం నీదే
హో.. చేతికందే లాగ నువ్వుండి ఉంటే
ఎంతకందేవోనె ఆ చెంపలు
ఆగలేనే నేను నిన్నే చేరాకా
ఖచ్చితంగా ఉండలేనే వేరుగా
ఎలా నిన్ను పొందాలో ఏమో మరి
ఎదురుగా నువ్వెలె వెనకన నువ్వెలె
పక్కన నువ్వెలె నా చుత్తు నువ్వెలె
ఎదురుగా నువ్వేలే వెనకనా నువ్వేలే
పక్కన నువ్వేలే నా చుట్టూ నువ్వేలే
హో.. నిన్ను చూడగానె నాకేదో అయ్యిందే
ఉన్నట్టుండి ప్రాణం నీ వైపే లాగిందే
నానా నాన నాన నానానా నానానా
నానా నాన నాన నానానా నానానా

Reactions

Post a Comment

0 Comments