Mallela Vanala Song Lyrics Babu Bangaram Movie (2016)
Movie: Babu Bangaram
Lyrics: Ramajogayya Sastry
Music: Gibran
Singer: Naresh Iyer
Cast : Venkatesh, Nayanathara
మల్లెల వానలా మంచు తుఫానులా
ముంచేసిందే నీలో మంచితనం
మనసే మనిషై ఇలా పుట్టేసిందే నీలా
ముద్దొస్తుందే నీలో హ్యూమనిజమ్
అచ్చైపోయావే చిట్టి గుండె లోతులో
నచ్చావే తొట్ట తొలి చూపులో
నా కంటి కలకిపుడెన్ని రంగులో
పడిపోయా నీ ప్రేమలో..
చూస్తున్నా చూస్తున్నా నను నీలో చూస్తున్నా
ఇస్తున్నా ఇస్తున్నా మనసే రాసిస్తున్నా
మల్లెల వానలా మంచు తుఫానులా
ముంచేసిందే నీలో మంచితనం
నా కంటి కలకిపుడెన్ని రంగులో
పడిపోయా నీ ప్రేమలో
చూస్తున్నా చూస్తున్నా నను నీలో చూస్తున్నా
ఇస్తున్నా ఇస్తున్నా మనసే రాసిస్తున్నా
ఇన్నాళ్లు ఏమయ్యావో ఏ దిక్కున దాక్కున్నావో
ఇవ్వాళ్లే ఇంతందంగా నా కంట్లో పడ్డావో
పున్నమిలో పుట్టుoటావో వెన్నెల నీ పేరంటావో
ఆల్చిప్పలో ముత్యంలాగా స్వచ్ఛంగా మెరిశావో
అందానికి హుందాతనం జంట చేరనా
దేవతలా నడిచోచ్చావు నేల బారునా
ఆకర్షించానే కొత్త కోనే గోడుగా
నే ఫిదా అయా…
నాలాగా నువ్వంట నీలాగా నేనంట
అనుకోకున్నా ఇలా కలిసింది మన జంట
నీ ఇంటి పేరే జాలి నీ మాటే చల్ల గాలి
నీ కంటి చూపే నాకు రాగాల జోలాలి
నువ్వే నా దీపావళి నువ్వే నా రంగుల హోలీ
నా గుండెల్లోని కాలి నీతోనే నిండాలి
సూర్యోదయాన సుబ్బలక్ష్మి భక్తి పఠన
మథర్ తెరిస్స నోటి మంచి మాటలా
చుట్టు ముట్టావే నన్ను అన్ని వైపులా
నే ఫిదా అయా…
మల్లెల వానలా మంచు తుఫానులా
ముంచేసిందే నీలో మంచితనం
నా కంటి కలకిపుడెన్ని రంగులో
పడిపోయా నీ మాయలో
చూస్తున్నా చూస్తున్నా నను నీలో చూస్తున్నా
ఇస్తున్నా ఇస్తున్నా మనసే రాసిస్తున్నా
0 Comments