Kaatuka Kallu Kaatuka Kallu Song Lyrics Sarocharu Movie (2012)

Kaatuka Kallu Kaatuka Kallu Song Lyrics Sarocharu Movie (2012)

Movie:  Sarocharu
Lyrics:  Chandrabose
Music:  Devi Sri Prasad
Singers:  Kushi Murali, Swetha Mohan, Chinna Ponnu

సిన్నదాని సూపుల్లో సిక్కినాడు సూరీడు..
పిల్లదాని నవ్వుల్లో నక్కినాడు సెందురుడు..
నవ్వలేని సూపుల్లొన ఏదొ గుట్టుందీ గుట్టుంది ..
ఓ..సూడలేని నవ్వుల్లొన ఏదొ బెట్టుందీ బెట్టుంది..

కాటుక కళ్ళు కాటుక కళ్ళు ఏమంటున్నాయో..
మాటలు రాని మందార పూలు ఏమంటున్నాయో..
చెప్పైవా ఓ పిల్ల చెప్పైవా..
గాజుల ఘల్లు గాజుల ఘల్లు ఏమంటున్నాదో..
గుప్పున రెగిన గుండెన ఝల్లు ఏమంటున్నాదో..
చెప్పైవా ఓ పిల్ల చెప్పైవా..
నా గుండెల్లొ పండగ తెచ్చావె నా గాజుల్లొ సడిపెంచావే..
నా పువుల్లో దారం అయ్యవే నా కళ్ళళ్ళో నీరై నువ్వే జారావే...
కాటుక కళ్ళు కాటుక కళ్ళు ఏమంటున్నాయో..
మాటలు రాని మందార పూలు ఏమంటున్నాయో..
చెప్పైవా ఓ పిల్ల చెప్పైవా..

సిన్నదాని సూపుల్లో సిక్కినాడు సూరీడు..
పిల్లదాని నవ్వుల్లో నక్కినాడు సెందురుడు..
నవ్వలేని సూపుల్లొన ఏదొ గుట్టుందీ గుట్టుంది ..
ఓ..సూడలేని నవ్వుల్లొన ఏదొ బెట్టుందీ బెట్టుంది..

హే..చిన్నీ చిన్నీ పాదాల్లొ చిట్టీ చిట్టీ అందెల్లో..
చిందే చిందే రాగాలన్నీ ఏమంటున్నాయో..
ఓ..నువ్వే నువ్వే నా జంట నీతొ స్నేహం చాలంట ..
ఏడే వద్దు ఆరే అడుగులు నడవాలన్నాయే..
చిటికేసె చేతులలొ గొరింట ఎరుపె ఏమంటుందొ..
కలకాలం కాకున్నా క్షణకాలం..
చెలిమై చెయి కలిపేస్తే చాలందీ..
కాటుక కళ్ళు కాటుక కళ్ళు ఏమంటున్నాయో..
మాటలు రాని మందార పూలు ఏమంటున్నాయో..
చెప్పైవా ఓ పిల్ల చెప్పైవా..

ఓ.. ముద్దు ముద్దు అందంలొ ముద్దుగుమ్మ రూపంలొ..
ముత్యం లాంటి ముక్కుపుడక ఏమంటున్నాదో..
ఓ.. ముక్కెర పైన మెరుపల్లే ముక్కెర చుట్టు సిగ్గల్లే..
ముక్కెర కింద ఊపిరినువ్వై ఉంటె చాలందె..
గలగలలా లోలగె గుసగుసగ చెవిలొ ఏమంటుందో..
నే పలికే మాటలకె నీ బదులె వింటు ఇక ఏమాట విననంది..
కాటుక కళ్ళు కాటుక కళ్ళు ఏమంటున్నాయో..
మాటలు రాని మందార పూలు ఏమంటున్నాయో..
చెప్పైవా ఓ పిల్ల చెప్పైవా..చెప్పైవా..

సిన్నదాని సూపుల్లో సిక్కినాడు సూరీడు..
పిల్లదాని నవ్వుల్లో నక్కినాడు సెందురుడు..
నవ్వలేని సూపుల్లొన ఏదొ గుట్టుందీ గుట్టుంది ..
ఓ..సూడలేని నవ్వుల్లొన ఏదొ బెట్టుందీ బెట్టుంది..

Reactions

Post a Comment

0 Comments