Inthajare Inthajare Song Lyrics Love Failure Movie (2012)


Inthajare Inthajare Song Lyrics Love Failure Movie (2012)

Movie:  Love Failure
Lyrics:  Sri Mani
Music:  S S Thaman
Singers:  Karthik, Suchitra
Cast:  Siddharth, Suchitra


పాతికేళ్లు వ్యర్థమేనా పేరుకైనా విలువలేదా
ఈ పిల్ల చెలిమిలో ఈ ఒక్క క్షణముకే
సలాము కొట్టేలా వయసు ఒట్టిపోయెనా
వెనకడుగే ముందుచూపా
నీవైపే పిల్లా వెల్లువెత్తే నా అడుగులే
నీలా మారిపోయే నా నడకలే
ఏ నీడా లేని దేహమేంటో
నీకు నాకు మధ్య అద్దం అడ్డు ఉన్నా
విడిపోవేమిటో
ఇంత్‌జారే ఇంత్‌జారే ఇంతలోకే ఎంత జోరే
బిందువల్లే ఉన్న నన్నే
జల్లులాగ మార్చినావే
ఇంత్‌జారే ఇంత్‌జారే
వింత మైకం చెంత చేరే
నిన్ను కలిసే వేళకోసం
వెల్లి విరిసే ఈ హుషారే

చిన్నిచిన్ని కవితలున్న పుస్తకంలా
నీ జ్ఞాపకాలు నిండి ఉన్న మనసు నేడిలా
హైకూల తోటి కోయిలమ్మ
కుహుకూలు నింపుతోందిలా
నానీలు రాసి వయసు వాణి
బాణీ కట్టి పాడుతోందిలా
ఈ పది రోజులే నీ పది ఆంఖ్లే
నిన్నిలా పదే పదే జ్ఞాపకం చేస్తుంటే
ఇంత్‌జారే ఇంత్‌జారే కాలికింది నేలజారే
తూలిపోయే భూమిలాగా  నవ్వులేక నేనెలాగ
ఇంత్‌జారే ఇంత్‌జారే ఇంతలోకే ఎంత మారే
గుండె పిండే తేనె పట్టే చేదు నిండా తీపి పుట్టే

నిన్న మొన్న కాలమంతా ఏమయిందో
రేపు అన్న భావమంతా మాయమైందో
నీ ఊహలోనే కాలమంతా
మైనమల్లె కరుగుతోందో
నీ రూపు తప్ప కంటిపాప
నన్ను కూడా చూడనందో
ఆశలే లేవులే ఆకలే ఉండదే
అలసటే రాదులే నిన్నిలా చూస్తుంటే
ఇంత్‌జారే ఇంత్‌జారే
తలపులన్నీ తారుమారే
సొంత స్ట్రీటులో నాకు నేనే
పరదేశిలా అయిపోయారే
ఇంత్‌జారే ఇంత్‌జారే
వరుస మొత్తం మారిపోయే
కళ్లు తెరిచే నిద్రపోయా
నిన్ను మరవడం మరిచిపోయా

Reactions

Post a Comment

0 Comments