Hrudayam Song Lyrics Parugu Movie (2008)



Hrudayam Song Lyrics Parugu Movie (2008)

Movie: Parugu
Lyrics: Sirivennela
Music: Manisharma
Singer: Hemachandra

హృదయం ఓర్చుకొలేనిదీ గాయం
ఇకపై తలుచుకొరానిదీ ఈ నిజం
పెదవులు విడిరాక నిలువవె కడదాకా
జీవంలో ఒదగవె ఒంటరిగా
లో లో ముగిసె మౌనంగా
ఓ ఓ ఔ ఔ ఔ
ఓ ఓ ఔ ఔ ఔ
హృదయం ఓర్చుకొలేనిదీ గాయం
ఇకపై తలుచుకొరానిదీ ఈ నిజం

ఊహలలోకంలొ ఎగరకు అన్నావే
తేలని మైకంలొ పడగని ఆపవే
ఇతరుల చిరునవ్వుల్లో నన్ను వెలిగించావె ప్రేమా
మరి నా కనుపాపల్లో నలుపై నిలిచావేమ్మా
తెలవారి తొలికాంతి నీవు
మలి కోరు పంతానీవు
అని ఎవరినడగాలి ఏమని చెప్పాలి
ఔ ఔ ఔ ఔ ఔ
హృదయం ఓర్చుకొలేనిదీ గాయం
ఇకపై తలుచుకొరానిదీ ఈ నిజం

వెచ్చని ఊపిరిగ వెలిగె సురీడూ
చల్లని చూపులతొ దీవెనలిస్తాడూ
అంతటి దూరం వుంటే బ్రతికించె వరమౌతాడూ
చెంతకి చేరాడంటే చితి మంటె అవుతాడూ
హలాహలం నాకు సొంతం
నువ్వు తీసుకొ అమృతం
అనకుంటె ఆ ప్రేమె ప్రేమ కాగలద
ఓ ఓ ఓ ఓ ఓ
హృదయం ఓర్చుకొలేనిదీ గాయం
ఇకపై తలుచుకొరానిదీ ఈ నిజం

Reactions

Post a Comment

0 Comments