Chaila Chaila Song Lyrics Shankar Dada MBBS Movie (2004)


Chaila Chaila Song Lyrics Shankar Dada MBBS Movie (2004)

Movie:  Shankar Dada MBBS
Lyrics:  Devi Sri Prasad
Music:  Devi Sri Prasad
Singers:  KK, Chiranjeevi
Cast      :  Chiranjeevi, Sonali Bendre


కరెక్టే ప్రేమ గురించి నాకేం తెలుసు
లైలా మజ్నూలకు తెలుసు పారు దేవదాసులకు తెలుసు
ఆ తరువాత తమకే తెలుసు
ఇదిగో తమ్ముడూ.... మనకీ ఓ లవ్ స్టోరీ ఉందమ్మా.... వింటావా....ఆ...
ఓ...యస్.. ఓ.....యస్....
హేయ్....చైలా చైలా చైలా చైలా .....
నేను వెంటపడ్డపిల్లపేరు లైలా
హేయ్....చైలా చైలా చైలా చైలా .....
నేను వెంటపడ్డపిల్లపేరు లైలా
హొయ్ లా హొయ్ లా హొయ్ లే హొయ్ లా
నడక చూస్తే చిక్కుబుక్కురైలా
గులాబిలాంటి లిప్పుచూసి నా పల్సురెటే పెరిగింది
జిలేబిలాంటి హిప్పుచూసి నా హర్టు బీటే అదిరింది
పాల మీగడంటి రంగుచూసి నా రక్తమంతా మరిగింది
నా ఏరియాలో ఎప్పుడూలేని లవ్వేరియా నాకు అంటుకుంది
ఓ మాయా ఓ మాయా ఈ ప్రేమ అంతే మాయా
అరె గోలా ఇది గోలా ఇది తియ్యనైన గోలా
ఓ మాయా ఓ మాయా ఈ ప్రేమ అంతే మాయా
అరె గోలా ఇది గోలా ఇది తియ్యనైన గోలా
చైలా చైలా చైలా.... చైలానేను వెంటపడ్డ పిల్ల పేరు లైలా

తర్వాతేమయ్యిందన్నా....
ఏమయిందా....
ఆ రోజువరకూ హాయిగా ఎలాపడితే అలా తిరుగుతూ గడిపేసేవాణ్ణి
కానీ ఆ రోజు నుంచి తిరుగుళ్ళు...నో చాన్స్....
దాదాగిరి...నోచాన్స్...ఓన్లీ రొమాన్స్....
ఊ...తన్ని చూసినాకనే డ్రింకింగ్ మానేసా
తెల్లావారుజామునే జాగింగే చేశా
డే ...వన్...దమ్ము కొట్టడం వదిలేశా
డే... టూ...దమ్ముదులపటం ఆపేశా
డే.....త్రీ.... పీక కోసే కత్తితోనే పూలు కోసి తీసుకొచ్చా
హొ...యా...ఇంటి ముందరే టెంటువేశా
హొ..యా.... ఒంటికందిన సెంటు పూశా
హొ...యా.. మంచినీళ్ళ లారీ దగ్గర బిందెకూడా బాగుచేసా
ఆ దెబ్బతో చిన్న చిర్నవ్వుతో ఫేను నా వైపు టర్నింగ్ ఇచ్చుకుంది
అదెమిటో మరి ఆ నవ్వు తో నా మనసంతా రఫ్ ఆడేసింది
ఓ మాయా ఓ మాయా ఈప్రేమ అంతే మాయా
అరె గోలా ఇది గోలా ఇది తియ్యనైన గోలా
చైలా చైలా చైలా ....చైలా....
జీవితంలో దేనీ మీదా ఆశపడని నేను
ఆ అమ్మాయి మీద ఆశలు పెంచుకున్నాను
ఎన్నో కలలుకన్నాను ఆ అమ్మాయి నాకే స్వంతం అనుకున్నాను
కానీ ఒక రోజు ఏం జరిగిందో ఏమో తెలీదు...ఆ అమ్మాయికి... పెళ్ళయిపోయింది.....
కళ్లలోన కలలు అన్నీ కధలుగానే మిగిలెనే
కనులుదాటి రాను అంటూ కరిగిపోయెలే
మరి తర్వాత ఏమయింది....
హు...తర్వాత...తర్వాత ఏమయింది
ఆ మరుసటిరోజు ...మా ఏరియాలోకి ఐశ్వర్య వచ్చిందీ
ఓ మాయా ఓ మాయా ఈ ప్రేమ అంటే మాయా
అరె గోలా ఇది గోలా ఇది తియ్యనైన గోలా
ఓ మాయా ఓ మాయా ఈ ప్రేమ అంతే మాయా
అరె గోలా ఇది గోలా ఇది తియ్యనైన గోలా
చైలా చైలా చైలా చైలా .....ఇదర్ ఆ...ఏంటిరా మీ కుర్రవాళ్ల గోల
చూడు తమ్ముడూ ప్రేమ అనేది లైఫ్లో ఓ చిన్న పార్టేకానీ
ప్రేమే లైఫ్ కాదు. ఆ మాత్రం దానికి అమ్మాయికోసం ప్రాణాలు తీసుకోవటం లేదా
ఆ  అమ్మాయి ప్రాణాలే తీయటం నేరం...క్షమించరానినేరం... అండర్ స్టాండ్
ఓడిపోవటం తప్పుకాదురా చచ్చిపోవడం తప్పు సోదరా
చావు ఒక్కటే దారంటే ఇక్కడుండే వాళ్లు ఎంతమందిరా
జీవితం అంటే జోక్ కాదురా దేవుడిచ్చిన గొప్ప గిప్ప్టురా
దాన్ని మద్యలో కతమ్ చేసే హక్కు ఎవరికీ లేదురా
నవ్వెయ్యరా చిరు చిందెయ్యరా
అరె బాధ కూడా నిన్ను చూసి పారిపోద్దిరా
దాటేయరా అడ్డు దాటేయరా ఏ ఓటమీ నిన్ను ఇక ఆపలేదురా
ఓ మాయా ఓమాయా ఈ లైఫ్ అంటే మాయా
ఓ మాయా ఓమాయా ఈ లైఫ్ అంటే మాయా
ఓ మాయా ఓమాయా ఈ లైఫ్ అంటే మాయా
ఓ మాయా ఓమాయా ఈ లైఫ్ అంటే మాయా

Reactions

Post a Comment

0 Comments